logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఆ యంగ్ హీరోతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు బయటపెట్టిన ప్రియమణి!

‘ఎవరే అతగాడు’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. ఆ తర్వాత జగపతి బాబుతో ‘పెళ్లైన కొత్తలో’, రాజమౌళి ‘యమదొంగ’ ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. జాతీయ ఉత్తమ నటిగా పేరు తెచ్చుకున్న ప్రియమణి కెరీర్ ఆ తర్వాత కొంత స్లో అయ్యింది. అయితే పెళ్లి తర్వాత మళ్ళీ ఆమె కెరీర్ ఊపందుకుంది. ప్రస్తుతం ఆమె సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటె ఇటీవల ప్రియమణి ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో తరుణ్ తో తన ప్రేమ వ్యవహారం వార్తలపై స్పందించారు. వీరిద్దరూ కలిసి ‘నవ వసంతం’ అనే సినిమా చేసారు. అప్పటికే తరుణ్ తో ఆర్తి అగర్వాల్ లవ్ అఫైర్ గురించి ఎన్నో రూమర్లు వచ్చాయి. అయితే నవ వసంతం సినిమా షూటింగ్ సమయంలో తరుణ్ ప్రియమణిల మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్దమయ్యారని వార్తలు వచ్చాయి.

దీనిపై ప్రియమణి స్పందిస్తూ.. తమిళనాడుకు చెందిన ఓ జర్నలిస్టు తనకు ఫోన్ చేసి తరుణ్, నాపై వస్తున్న వార్తల గురించి చెప్పారు. నన్ను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దీంతో నేను ఆ వార్తలు రాసిన జర్నలిస్టుకు ఫోన్ చేసి ప్రశ్నించాను. తరుణ్ నాకు కారు గిఫ్ట్ ఇచ్చారని, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని రాశారు. అందులో ఏ ఒక్కటి నిజం కాదు ఇలాంటి వార్తలు ఎలా రాస్తారని అతనిపై ఫైర్ అయ్యానని చెప్పుకొచ్చింది ప్రియమణి.

Related News