logo

  BREAKING NEWS

బ్రేకింగ్: ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా కేసులో యువతి ఆత్మహత్య!  |   కుప్పంలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. షాకివ్వనున్న కీలక నేతలు!  |   విద్యార్థులకు శుభవార్త : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ఆదేశాలు!  |   కుప్పం కోటలు బద్దలు కొట్టారు.. మంత్రిపై సీఎం జగన్ ప్రశంసలు!  |   హాలీవుడ్‌లోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంట్రీ..?  |   బంగారం కొనేందుకు బెస్ట్ టైమ్‌.. 23.02.2021 బంగారం ధ‌ర‌లు  |   తమిళ‌నాడులో జ‌గ‌న్ క‌టౌట్లు.. అస‌లు సంగ‌తి ఇదీ  |   వైఎస్ షర్మిల పార్టీలో తొలి నియామకం.. టీఆర్ఎస్ సీనియర్ నేతకు చోటు!  |   మంత్రి పెద్దిరెడ్డికి మరో కీలక బాధ్యత.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్!  |   టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని కూతురు..!  |  

వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వేసివి కాలంలో మామూలు మనుషులకే చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాంటిది గర్భిణీ స్త్రీలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. హార్మోన్లలో చోటుచేసుకునే అనేక మార్పులు, ఈస్ట్రోజెన్ లెవల్స్ పెరగడం ఇందుకు కారణమవుతాయి. ఇతర కాలాలతో పోలిస్తే వేసవికాలం గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వేసవిలో గర్భం ధరించిన స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

ఈ సమయంలో వారిలో ఉండే నీరసం, చిన్న చిన్న నొప్పులు, ఆయాసం వంటి ఇబ్బందులు వేసవి కాలంలో అధికమవుతాయి. డీహైడ్రేషన్ సమస్య వీరిని అధికంగా వేధిస్తుంది. కాబట్టి రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాల వంటివి తీసుకోవాలి. ఆహారంలో వేపుళ్ళు, మసాలాలు, ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఎండలో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండాలి. తెల్లవారుజామున, సాయంత్ర సమయాల్లో వాకింగ్ చేయడం ఆరోగ్యకరం. కాటన్ బట్టలు, తేలికగా, లూజుగా లేత రంగుల్లో ఉండే బట్టలని వేడుకోవడం మంచిది. మధ్యాహ్న సమయాల్లో ఒక గంట సేపు నిద్ర పోవాలి.

ఎండల కారణంగా కాళ్ళ వాపులు ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. కాళ్ళను ఎత్తుపై పెట్టుకోవడం, పడుకునేటప్పుడు కాళ్ళ కింద దిండును ఉంచడం వంటివి చేస్తే ఉపశమనం లభిస్తుంది. గర్భిణీ స్త్రీలు స్విమ్మింగ్ చేయగలిగితే ఇంకా మంచిది. శరీరానికి అవసరమైన తేమ లభించి ఎండల కారణంగా వచ్చే అలసట నుంచి బయట పడవచ్చు. బయటకు వెళ్లాల్సి వస్తే
సన్ స్క్రీన్ లోషన్లను వాడాలి. గర్భం ధరించిన స్త్రీలు వేసవిలో కాస్మెటిక్స్ జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. అందులో ఉండే రసాయనాలు బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. హార్మోన్ల మార్పులతో వేడి ఆవిర్లు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. గర్భం పొందిన మహిళల్లో సాధారణ మహిళల కన్నా టెంపరేచర్ లెవల్స్ అధికంగా ఉంటాయి. అందుకు వేసవి ఎండలు తోడైతే అది వివరించడానికి వీలు లేనంత అసౌకర్యానికి గురి చేస్తాయి.

వీటితో పటు గర్భధారణసమయంలో పాటించే అన్ని జాగ్రత్తలను పాలించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భంలోని శిశువు ఎదుగుదల తల్లి తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే డ్రై ఫ్రూట్స్ ను తగిన మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తింటే మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. అయితే వీటిలో ఉండే ప్రోటీన్లు, క్యాల్షియం, ఫాస్పరస్, వంటి అనేక పోషకాలు బిడ్డతో పాటు తల్లిని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకోసం ఆహారంలో బాదం, కాజు, అంజీర లాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.

ఇవి శిశువు ఏడాది ఎదుగుదలకు, ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి. డ్రై ఫ్రొట్స్ లో ఉండే విటమిన్ ఇ ఇది తల్లి, బిడ్డ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తాజా పండ్లలో పుచ్చపండును ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఉండే నీటి శాతం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంచుతుంది. వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు వేడి చేస్తుందని గుడ్లను తినడానికి సందేహిస్తుంటారు. కానీ ఉడికించిన గుడ్లలో ఉండే ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. కాబట్టి రోజుకు రెండుకు మించకుండా ఉడికించిన గుడ్లను ఆహారంలో చేర్చుకోవాలి.

Related News