logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

ప్రీ వెడ్డింగ్ షూట్ లో విషాదం.. ప్రాణాలు కోల్పోయిన యువ జంట

పెళ్లికి ముందు ఎంతో ఇష్టపడి చేయించుకునే ప్రీ వెడ్డింగ్ షూట్ లో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల అర్థనగ్నంగా ఫోటోలు తీసుకున్న ఓ యువ జంట విమర్శలపాలైన విషయం తెలిసిందే. కానీ కర్ణాటక రాష్ట్రంలో ఇదే తరహా ఘటనలో యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. చంద్రు, శశికళకు ఈ నెల చివర్లో వివాహం జరగనుంది.

దీంతో వారిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించుకోవాలని ఆశ పడ్డారు. అందుకోసం తలక్కడ్ ప్రాంతంలో ఉన్న కావేరి నదికి వెళ్లారు. పడవలు అందుబాటులో లేకవడంతో ఓ తెప్ప సహాయంతో చంద్రు, శశికళ, వారితో ఉన్న మరో స్నేహితుడు నదిలోకి వెళ్లారు. నది మధ్యలో ఫోటోలు తీసుకుంటున్న సమయంలో శశికళ అదుపుతప్పి నదిలో పడిపోయింది.

ఆమెను కాపాడటానికి చంద్రు కూడా నీటిలోకి దూకేసాడు. నది లోతు, నీటి ప్రవాహానికి వారిద్దరూ నదిలో గల్లంతయ్యారు. పడవ నడిపే వ్యక్తిని, చంద్రు స్నేహితుడిని స్థానికులు సురక్షితంగా కాపాడగలిగారు. కాగా మరికొన్ని రోజుల్లో ఒక్కటవ్వాల్సిన యువ జంట ఇలా అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.

Related News