logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!

ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ(పీఆర్సీ) నివేదిక లీక్ పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తెలంగాణ ఉద్యోగుల ఫిట్ మెంట్ పై ప్రభుత్వం ముగ్గురు సభ్యుల బృందంతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.

అయితే ఈ నివేదిక ప్రభత్వానికి చేరిన కొద్ది నిమిషాలకే బయటకు లీకవ్వడం పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించింది తెలంగాణ సర్కార్. మరోవైపు పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 7. 5 పీఆర్సీ ప్ఫిట్ మెంట్ పై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు సందర్భంగా 75 శాతం ఫిట్ ఉంటుందని ఆశీంచాము. కనీసం 60 నుంచి 65 మధ్య ఉంటుందని అంచనా వేసాము. చివరకు 63 శాతంగా ఉంటుందని భావించామన్నారు. కానీ ఇవేవీ కాకుండా చివరకు 7.5 గా ఫిట్ మెంట్ ను ప్రకటించడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పీఆర్స్ నివేదికపై ఈరోజు చర్చలు జరగనున్న నేపథ్యంలో అంతకు ముందే పీఆర్సీ నివేదిక పేరుతో 25 పేజీల పిడిఎఫ్ లేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికలో సూచించిన ప్రకారమే ఉద్యోగులకు ఫిట్ మెంట్ పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7. 5 ఫిట్ మెంట్ ను ఇవ్వాలని పీసీఆర్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Related News