logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

కాంగ్రెస్ పతనానికి కారణం ఆ ఇద్దరే.. ప్రణబ్ ఆత్మకథలో సంచలన విషయాలు

దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసుకున్న ఆత్మకథ ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పేరుతో వెలువడింది. ఈ ఆత్మకథలో ప్రణబ్ చాలా ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం తగ్గడానికి గల కారణాలను అయన తన ఆత్మ కథలో రాసుకొచ్చారు. ప్రణబ్ రాసిన ఈ పుస్తకంలోని విషయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.

2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం సోనియా, మన్మోహన్ లే అని ఆయన సంచలన విషయాలను వెల్లడించారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పుడు విదేశీ మహిళ అని సోనియా గాంధీని ప్రధానిగా వ్యతిరేకించారు. దీంతో మన్మోహన్ సింగ్ ప్రధాని బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసందే.

అప్పుడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ కాకుండా తాను ప్రధాని అయ్యుంటే 2014 ఎన్నికల్లో పార్టీకి ఇంతటి పరాజయం కలిగి ఉండేదని పార్టీలోని కొందరు నేతలు తనతో అన్నారని ఈ వ్యాఖ్యలతో తాను ఏకీభవించకపోయినా తాను రాష్ట్ర పతిగా వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ దృష్టిని కోల్పయిన మాట వాస్తవమేనన్నారు.

2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ దారుణంగా పతనమైందని అంతా అంటుంటారు కానీ తాను ఎప్పుడైతే రాష్ట్రపతి పదవి చేపట్టి పార్టీ వీడి వెళ్లానో అప్పుడే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందన్నారు. సోనియా గాంధీ పార్టీని నడిపించడంలో విఫలమైందన్నారు. అందుకు గల కారణాలను కూడా ప్రణబ్ తన ఆత్మకథలో విశ్లేషించారు. ప్రధానంగా తాను పార్టీ వీడిన తర్వాత సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, పార్టీ ఎంపీల మధ్య బంధం తెగిందన్నారు.

2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ యూపీఏను రక్షించుకోవడంలోనే మునిగిపోయారన్నారు. అదే సమయంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈసందర్భంగా ప్రధాని మోడీపై కూడా ప్రణబ్ కీలక వ్యాఖ్యలు చేసారు. మోడీది నియంత పాలన అని అయన హయాంలో కార్యనిర్వాహక, న్యాయ, శాసన వ్యవస్థల మధ్య సంబంధాలు అస్తవ్యస్తం అయ్యాయన్నారు.

మోడీ పాలనతో తాను ఏకీభవించనని చెప్పకనే చెప్పారు ప్రణబ్. కాగా ప్రణబ్ తన ఆత్మ కథలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా పేరును కూడా ప్రస్తావించారు. 2015 లో ఒబామా భారత్ కు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ను పక్కనపెట్టి తనతో కారులో రావాలన్నారు. అయితే తాను అందుకు అంగీకరించలేదని ప్రణబ్ తెలిపారు. ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది.

Related News