logo

మేనకోడలితో ప్రభుదేవా ప్రేమాయణం.. పెళ్లి?

దక్షిణాదిలో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరున్న ప్రభుదేవా ఆ తర్వాత దర్శకుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. సుందరం మాస్టర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన గుర్తింపు సంపాదించాడు. ఆ మధ్య నయనతారతో రిలేషన్ కారణంగా కొంతకాలం వార్తల్లో నిలిచాడు ప్రభుదేవా.

ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ పెళ్లివార్తలు సినీ పరిశ్రమలో గుప్పుమంటున్నాయి. ప్రభుదేవా తనకు మేనకోడలు వరుసయ్యే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. త్వరలో ఆమెను రెండో వివాహం చేసుకోనున్నాడట. 1995 లో రామలతను పెళ్లి చేసుకున్న ప్రభుదేవా నయనతార ప్రేమలో పడి 2011 లో ఆమెకు విడాకులు ఇచ్చేసాడు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే కొన్ని కారణాల వల్ల నయన తార ప్రభుదేవాల పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నయన విగ్నేష్ శివన్ అనే కుర్ర డైరెక్టర్ తో ప్రేమలో ఉండగా ప్రభుదేవా మాత్రం సింగల్ గా కాలం గడిపేస్తున్నాడు. అయితే కొంతకాలంగా ప్రభుదేవా శోభా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోనున్నట్టుగా కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి

Related News