logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

మన తెలుగు హీరోకు మరో అరుదైన గౌరవం..!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా విడుదలై నాలుగేళ్లు గడుస్తున్నా ఈ సినిమాకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ సినిమాలో నటించిన ప్రభాస్ కు రష్యా కు చెందిన ఓ ప్రతిష్టాత్మక అవార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు.

‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ పేరుతో ఇచ్చే ఈ అవార్డుకు ప్రభాస్ ఎంపికయ్యాడు. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయ నటుడు ప్రభాస్ కావడం విశేషం. గతంలో నటుడు రాజ్ కుమార్ శ్రీ ‘ఆవారా’, ‘ఆరాధన’ సినిమాలు రష్యన్ల మనసుల్ని గెలుచుకున్నాయి. అందుకుగాను ఈ అవార్డు ఇచ్చి గౌరవించారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు 2015 లో విడుదలైన ‘బాహుబలి ది బిగినింగ్’ సినిమాకు ప్రభాస్ ను ఈ అవార్డు కోసం ఎంపిక చేసారు.

బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాను రష్యాలో కూడా విడుదల చేయగా ప్రభాస్ కు అక్కడి అభిమానులు ఫిదా అయిపోయారు. ఇటీవల ఈ సినిమాను అక్కడి టెలివిజన్లలో ప్రసారం చేయగా అత్యధిక రేటింగ్లను సాధించిందన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ -నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కుతోందని సమాచారం.

Related News