అయోధ్య రామ మందిరం నిర్మాణం నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ లో కూడా రాముడి సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ ‘అదిపురుష్’ సినిమాను ఇదే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటె ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త సినీ వర్గాలను, అభిమానులను ఊపేస్తుంది.
కొంత కాలం కిందట టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ రామాయణం నేపథ్యంలో ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాకు `దంగల్` దర్శకుడు నితీష్ తివారీ,`మామ్` దర్శకుడు రవి ఉడయార్ రూపొందించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో మొదట హృతిక్ రోషన్ నటించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా యూనిట్ రాముడి పాత్ర కోసం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును సంప్రదించారట.
ఆయనకు కథ కూడా వినిపించినట్టు సమాచారం. ఈ సినిమాలో రావణుడి పాత్రలో హృతిక్ రోషన్, సీత పాత్రలో దీపికా పడుకునే నటిస్తున్నారట. దాదాపు రూ. 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించే ప్లాన్ ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ ఇదే కాన్సెప్ట్ తో వస్తుంది. ఇప్పుడు ప్రభాస్ కు పోటీగా మహేష్ బాబును రంగంలోకి దింపడానికి సిద్దమయ్యారట మూవీ మేకర్స్. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.