logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

టాలీవుడ్ లోకి ప్రభాస్ సోదరి గ్రాండ్ ఎంట్రీ..!

ఉప్పలపాటి ఫ్యామిలీ నుంచి మొదటి సారి వారసురాలు ఎంట్రీ ఇవ్వననుంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు ద్వారా ఆయన సోదరుడు నిర్మాతగా పరిచయమైన సంగతి తెలిసిందే. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో కృష్ణం రాజు నటించే సినిమాల నిర్మాణ పనులు ఆయనే పర్యవేక్షించేవారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రభాస్.. హీరోగా ఇప్పుడు టాలీవుడ్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు.

కాగా తాజాగా కృష్ణం రాజు పెద్ద కుమార్తె, ప్రభాస్ సోదరి ప్రసీద టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రభాస్ 20వ సినిమా గా తెరకెక్కుతున్న’ రాధే శ్యామ్’ ను ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరితో పాటు మరో నిర్మాతగా ప్రసీద వ్యవహరిస్తున్నారు. ప్రసీద నిర్మాతగా తొలి సినిమానే ప్యాన్ ఇండియా సినిమా కావడం విశేషం.

ఇపుడు ఈ వార్తతో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకుంది ప్రసీద. అంతేకాదు ఓ వైపు ప్రభాస్ తో రాధే శ్యామ్ చేస్తూనే మరోవైపు ఓటిటి ప్లేట్ ఫార్మ్ పై సినిమాలు నిర్మించేందుకు సిద్దమవుతుంది.

Related News