ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ సినిమాలో ప్రభాస్ తో రొమాన్స్ చేసిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ షేర్ చేసిన తన చిన్ననాటి ఫోటో ఇప్పుడు బాలీవుడ్ తారల మనసు దోచుకుంటుంది.
పాల బుగ్గలతో బుల్లి గౌను వేసుకుని మెరిసే కళ్ళతో ఎంతో అమాయకంగా ఉన్న ఈ బ్యూటీ ని చూసి ఆమె అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. ఇప్పుడు ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ప్రీతి జింతా, యామి గౌతమ్, మనీష్ పాల్, ఊర్వశి రౌతాలా వంటి నటీనటులు ఈ ఫోటోపై కామెంట్లు చేస్తూ చాలా క్యూట్ గా ఉన్నావంటూ కితాబిస్తున్నారు. కాగా శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ 2006 లో మిస్ మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది.
మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది. ఇక 2009 లో ‘అల్లాదీన్’ అనే ఫాంటసీ డ్రామా సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రవి తేజ నటించిన ‘కిక్’ సినిమా ను బాలీవుడ్ లో సలీమాన్ ఖాన్ రీమేక్ చేయగా అందులో హీరోయిన్ గా నటించడంతో జాక్వెలిన్ కెరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమా భారత దేశంలోనే అత్యంత ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడామె బీ టౌన్ లో బిజీ హీరోయిన్ గా మారింది.