logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

ప్ర‌భాస్.. నువ్వు సూప‌ర్ బాస్‌..! జిమ్ ట్రైన‌ర్‌కు భారీ గిఫ్ట్

టాలీవుడ్ హీరోలు వారి‌ వ‌ద్ద ప‌ని చేసే వారిని స్నేహితులుగా భావిస్తుంటారు. ప్ర‌త్యేకించి ప్ర‌భాస్ త‌న కోసం ప‌ని చేసే వారిని కుటుంబ స‌భ్యుల్లా చూసుకుంటారు. నేష‌న‌ల్ లెవెల్ స్టార్‌గా ఎదిగినా ప్ర‌భాస్ తన మ‌నుషుల‌ను మాత్రం ఎప్పుడూ ప్రేమిస్తుంటారు. ఈ విష‌యాన్ని ఆయ‌న వ‌ద్ద ప‌ని చేసే వారు ఎప్పుడూ చెబుతుంటారు. తాజాగా, ఏ హీరోకు సాధ్యం కానీ ఒక ప‌ని చేయ‌డం ద్వారా ప్ర‌భాస్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. త‌నకు జిమ్ ట్రైన‌ర్‌గా ప‌ని చేసే ల‌క్ష్మ‌ణ్ రెడ్డికి ప్ర‌భాస్ అపురుప‌మైన‌, ఖ‌రీదైన కానుక ఇచ్చి షాక్‌కు గురి చేశాడు.

ల‌క్ష్మ‌ణ్ రెడ్డి హైద‌రాబాద్‌లో బెస్ట్ జిమ్ ట్రైన‌ర్‌. 2010 మిస్ట‌ర్ వ‌రల్డ్ టైటిల్ విజేత‌. ప్ర‌భాస్‌కు ప‌ర్స‌న‌ల్ ట్రైన‌ర్‌గా గ‌త ఎనిమిదేళ్ల‌ నుంచి ప‌ని చేస్తున్నాడు. మిర్చి సినిమాలో ప్ర‌భాస్ స్లిమ్‌గా క‌నిపిస్తాడు. బాహుబ‌లి నాటికి సిక్స్ ప్యాక్‌తో ఉంటాడు. సాహో సినిమాలో మ‌ళ్లీ స్లిమ్‌గా మార‌తాడు. ఇలా ఏ సినిమాకు ఎలా అవ‌స‌రం ఉంటే అలా ప్ర‌భాస్‌ను మార్చ‌డంలో ల‌క్ష్మ‌ణ్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. దీంతో ల‌క్ష్మ‌ణ్ అంటే ప్ర‌భాస్‌కు మంచి గౌర‌వం.

అందుకే ఎప్పుడూ ల‌క్ష్మ‌ణ్‌ను ప్ర‌భాస్ త‌న వ‌ద్ద ప‌ని చేసే వ్య‌క్తిగా చూడ‌డు. త‌న స్నేహితుడిగా భావిస్తుంటాడు. ఈ క్ర‌మంలో ల‌క్ష్మ‌ణ్ రెడ్డికి ఏదైనా మంచి కానుక ఇవ్వాల‌ని ప్ర‌భాస్ నిర్ణ‌యించాడు. హీరోలు త‌మ జిమ్ ట్రైన‌ర్ల‌కు గిఫ్ట్‌లు ఇవ్వ‌డం కామెనే. కానీ, ప్ర‌భాస్ ఇచ్చిన గిఫ్ట్ మాత్రం కామ‌న్ కాదు. ఎందుకంటే ఏకంగా రేంజ్ రోవ‌ర్ కారును ల‌క్ష్మ‌ణ్‌రెడ్డి గిఫ్ట్ ఇచ్చాడు ప్ర‌భాస్‌.

రేంజ్ రోవ‌ల్ వెలార్ అనే మోడ‌ల్ స్పోర్ట్స్ కారు ఇది. దీని ధ‌ర అక్ష‌రాలా రూ.73 ల‌క్ష‌లు. ఈ ల‌క్ష‌రీ కారును ల‌క్ష్మ‌ణ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన త‌ర్వాత ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌తో ప్ర‌భాస్ ఫోటోలు దిగాడు. ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంత భారీ విలువైన కారును జిమ్ ట్రైన‌ర్‌కు గిఫ్ట్‌గా ఇవ్వ‌డం అంటే మామూలు విష‌య‌మా అని ఈ వార్త చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్ర‌భాస్ అభిమానులైతే త‌మ హీరో మ‌న‌స్సు ఎంత గొప్ప‌దో అంటూ ఖుషీ అయిపోతున్నారు.

కాగా, ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ చిత్రానికి రాధాకృష్ణ ద‌ర్శ‌కుడు. 1920 ప్యారిస్ బ్యాగ్రౌండ్‌తో సాగే సీన్‌ల‌కు సంబంధించిన షూటింగ్‌కు ప్ర‌భాస్ సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో భారీ సినిమాలో ప్ర‌భాస్ హీరోగా న‌టించ‌నున్నాడు. ఆ త‌ర్వాత బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ డైరెక్ష‌న్‌లో ఆదిపురుష్ అనే భారీ సినిమాలో రాముడిగా ప్ర‌భాస్ న‌డించ‌నున్నాడు.

Related News