logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ప్రభాస్ తో కలిసి నటించనున్న ఆ బాలీవుడ్ హీరో ఎవరు..?

బాహుబలి, సాహో సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ తన కొత్త సినిమా గురించి అప్ డేట్ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఏకంగా బాలీవుడ్ దర్శకుడితో తన 22 వ సినిమాను ప్రకటించాడు. దర్శకుడు ఓం రౌత్ చెప్పిన కథ ప్రభాస్ కు నచ్చడంతో ఈ సినిమాను ఇప్పుడు తెలుగు హిందీతో పాటుగా అన్ని దక్షణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

కాగా ఈ సినిమా కు అది పురుష అనే టైటిల్ ను ఖరారు చేసారు. మంచి పై చెడు విజయం అనే టాగ్ లైన్ ను ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా అందుకు సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రామాయణంలోని కీలక ఘట్టాలను ఆధారం చేసుకుని ఈ సినిమా కథ ఉంటుందని ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడని సమాచారం.

అంతే కాదు మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ ప్రముఖ హీరో కూడా నటించనున్నాడని తెలుస్తుంది. కాగా ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఆ బాలీవుడ్ హీరో ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై త్వరలోనే సినిమా టీమ్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Related News