logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఆ బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్@ 24.. రికార్డులు షేక్ అవ్వడం ఖాయం

‘బాహుబలి’తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు అన్ని పరిశ్రమల వారికి మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. వరుస సినిమా అప్ డేట్లతో ఫాన్స్ కు ఊపిరాడకుండా చేస్తున్నాడు రెబల్ స్టార్. తాజాగా ప్రభాస్ 24వ సినిమాకు సంబందించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన సిద్దార్థ ఆనంద్ అనే దర్శకుడితో ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్టుగా సమాచారం. ఈవార్తతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

2019 లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సిద్దార్థ ఆనంద్ దర్శకుడిగా ‘వార్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టించింది. చక్కటి కథ, అత్యద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ దర్శకుడు ఇప్పుడు రెబల్ స్టార్ కోసం ఓ కథను తయారు చేసాడట. ఇటీవల ఆదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ను కలిసి తన కథని వినిపించాడట.

సిద్దార్థ్ స్టోరీ లైన్ కు ఇంప్రెస్ అయిన ప్రభాస్ వెంటనే ఒకే చెప్పాడట. ప్రస్తుతం షారుక్ ఖాన్ తో ‘పఠాన్’ , హ్రితిక్ రోషన్ తో ‘ఫైటర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఆనంద్. ఈ సినిమాల తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను మైత్రి మూవీ బ్యానర్ నిర్మించనున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఇందుకు సంబందించిన అఫీషియల్ ప్రకటన రానుంది.

ఇదిలా ఉంటె ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. జూన్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ఏడాదిలో ప్రభాస్ నుంచి రాబోతున్న మొదటి సినిమా ఇదే. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. మరో వైపు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ మూవీ షూటింగ్ దశలో ఉంది.

 

Related News