logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కరోనా వాక్సిన్ తీసుకున్న వారిలో కొన్ని లక్షణాలు కనిపించవచ్చని అయితే వాటిపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదంటూ కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ తర్వాత కలిగే కొన్ని లక్షణాల పై అవగాహన కల్పిస్తూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది.

కరోనా వాక్సిన్ ఇంజెక్షన్ చేసిన చోట వాపు లేదా నొప్పి కలగవచ్చన్నారు. తలనొప్పి, అలసట, వాంతి వచ్చినట్టుగా అనిపించడం, కండరాల నొప్పి, దురద లాంటి లక్షణాలు ఉండవచ్చన్నారు. కొందరిలో జ్వరం ఒళ్ళు నొప్పులు, పొత్తి కడుపులో నొప్పి ఉండవచ్చన్నారు. తలతిప్పడం, వణుకు, దగ్గు వంటి లక్షణాలు కనిపించడం సహజమేనన్నారు.

అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కావని వాక్సిన్ కు శరీరం స్పందిస్తుందని చెప్పే సంకేతాలు అన్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారు వైద్యులకు సమాచారం ఇవ్వాలి. ఈ లక్షణాలు రెండు రోజుల పాటు ఉంటాయన్నారు. రెండవ డోసు వాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ లక్షణాలు కొంచెం ఎక్కువగా కనిపంచే అవకాశం ఉందన్నారు. అయితే వీటికి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందన్నారు .

చర్మం సున్నితంగా మారడం, అలసట, చిరాకుగా అనిపించడం కూడా వాక్సిన్ వేసుకోవడం వలన కలిగే లక్షణాలే అన్నారు. మొదటి డోసు వాక్సిన్ తీసుకున్న వారు నెల వ్యవధిలో రెండవ డోసు కూడా కచ్చితంగా తీసుకోవలసి ఉంటుందని వైద్యులు స్పష్టం చేసారు. అయితే ప్రస్తుతం వాక్సినేషన్లో భాగంగా కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి.

మొదటి డోసు ఏ టీకా తీసుకుంటారో రెండవ డోసు లో కూడా అదే టీకా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. వాక్సిన్ తీసుకున్న వారు కూడా కచ్చితంగా భౌతిక దూరం, మాస్కులు ధరించి కరోనా నిబంధనలను పాటించాలన్నారు. మన దేశంలో అందిస్తున్న టీకా సురక్షితమని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

Related News