logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

కరోనా నుంచి కోలుకున్నవారిలో ఊపిరితిత్తుల పరిస్థితి ఏమిటి?

కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి. ఈ వైరస్ బారిన పడినవారిలో ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. లక్షణాలు లేకుండా కరోనా సోకిన వారిలో కూడా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. 50 శాతానికి పైగా కరోనా బాధితులు ఇలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు. కరోనా వైరస్ నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభావం వారిపై దీర్ఘకాలం కొనసాగుతుంది.

కరోనా సోకినప్పుడు వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్న వారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. అసలు కరోనా సోకి కోలుకున్న వారిలో ఊపిరితిత్తులు తిరిగి సాధారణ స్థితికి వస్తాయా ? అనే విషయం తెలుసుకునేందుకు చాలానే పరిశోధనలు జరిగాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం..

కరోనా బారిన పడినంత మాత్రాన ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరోనా నెగిటివ్ వచ్చిన మూడు నెలల్లోనే లంగ్స్ తిరిగి ఆరోగ్యంగా మారుతున్నట్టుగా గుర్తించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వారు మళ్ళీ లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. కానీ కేవలం మూడు నెలల తర్వాత ఎలాంటి చికిత్స అవసరంలేకుండా వాటంతట అవే మెరుగవుతున్నాయి.

150 మంది కరోనా బాధితులకు సీటీ స్కాన్, కార్డియోగ్రామ్‌లను నిర్వహించి వారి లంగ్స్ పని తీరును పరిశీలించారు. వీరిలో 80 శాతం మంది రోగులకు లంగ్స్ దెబ్బతిన్నట్టుగా వెల్లడైంది. అలాగే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు వంటి లక్షణాలు కనిపించాయి. కానీ, 12 వారాల తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతినడం 56 శాతం మేర తగ్గిందని నిపుణులు తెలిపారు.

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్న వారు లైఫ్ లాంగ్ సమస్యను ఎదుర్కొనే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి సగటు వయసు 61 ఏళ్ళు. వీరిలో సగానికి పైగా పురుషులే ఉన్నారు. పొగ తాగే అలవాటు ఉన్నవారు, ఊబకాయులు, వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్నవారిపై ఈ అధ్యయనం జరిపారు.

అయినప్పటికీ కరోనా నుంచి కోలుకున్నవారు మూడు నెలల పాటు వైద్యుల సూచనలు పాటించాలి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరితే ముందుగా శరీరం జ్వరం ద్వారా స్పందిస్తుంది. కాబట్టి నెగిటివ్ వచ్చిన కొద్దీ రోజులకు జ్వరం ఉంటే అశ్రద్ధ చేయకూడదు. అలాగే సీటీ స్కాన్ ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కనిపెట్టుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

Related News