logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

జీహెచ్ ఎంసీ ఎన్నికలు: కేసీఆర్ పాలనపై పోసాని కీలక వ్యాఖ్యలు

జీహెచ్ఎంసీ ఎన్నికలపై సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ కు తన పూర్తి మద్దతు తెలియజేసారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ అంటే కేవలం అల్లర్లు మాత్రమే గుర్తొచ్చేవి. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ అల్లర్లు తగ్గుముఖం పట్టాయి.

ఆ తర్వాత ఇన్నేళ్లకి మళ్ళీ కేసీఆర్ హయాంలోనే హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ వస్తే చుక్క నీరు దొరకదని, విధ్వంసం జరుగుతుందన్నారు. ఆంధ్రా వాళ్ళని తరిమికొడతారని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఎలాంటి ఇబ్బందులు రాలేదు. స్థానికేతరులను కూడా ఇక్కడి వారితో సమానంగా కేసీఆర్ చూస్తున్నారు.

గతంలో ఎప్పుడు కరెంట్ ఉండేదో ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. కేసీఆర్ వచ్చాక కరెంటు సమస్యలు లేవన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత కేసీఆర్ దే అన్నారు. తెలంగాణ పోరాటం సమయంలో తెలియకుండా కేసీఆర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు కానీ రాష్ట్రంలో కేసీఆర్ మత సామరస్యాన్ని కాపాడారన్నారు.

Related News