logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

చచ్చిపోయినా పరవాలేదన్నాడు.. దర్శకుడిపై నటి సంచలన వ్యాఖ్యలు!

సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలిచే నటి పూనమ్ కౌర్ తాజాగా మరోసారి వివాదాస్పద ట్వీట్ చేసింది. అందులో పరోక్షంగా ఓ దర్శకుడి పేరు ప్రస్తావించకుండా ఆయనపై మండిపడింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ పరిస్థితే నాకు కూడా కలిగించేలా అతను నాతో ప్రవర్తించాడని నిప్పులుచెరిగింది. నేను మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని నా స్నేహితుడు అతనికి తెలిపాడు. నాకు ఏదైనా సలహా ఇవ్వాలని కోరాడు.

అందుకు ఆ దర్శకుడు నన్ను పట్టించుకోకపోగా ‘నువ్వు పోతే ఒక రోజు వార్త అవుతావు. అంతకు మించి ఏమి జరగద’ని అవహేళన చేసాడు. అతని నిజస్వరూపాన్ని చూసి అసహ్యమేసింది. అంతేకాదు సినిమాను, మీడియాను, మూవీ మాఫియాను అతనే కంట్రోల్ చేస్తాడు. కొన్ని సైట్లలో నాపై తప్పుడు వార్తలు రాయించి నన్ను మానసికంగా కుంగిపోయేలా చేసాడు. నన్ను సినిమాల నుంచి నిషేదించేలా చేసాడు.

తన స్వార్థం కోసం స్నేహితులను మభ్యపెడుతూ బతుకుతుంటాడు. సినిమా అవార్డు వేడుకలలో కూడా నన్ను రాకుండా అడ్డుకున్నాడు. సుశాంత్ లాగా ఆత్మహత్య చేసుకునే విధంగా నన్ను ప్రేరేపించాడు. కానీ నేనెందుకు ఇలా ఉండాలి అనుకున్నా. మారేందుకు ప్రయత్నిస్తున్నా అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నా. అంతకు మించి అతను నన్ను ఏమి చేయలేడు. అని చెబుతూ గురూజీ అనే హాష్ టాగ్ ను పూనమ్ కౌర్ టాగ్ చేసింది. ఇప్పుడు పూనమ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News