logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!

మ‌హ‌బూబాబాద్‌లో కిడ్నాపైన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డిని హ‌త‌మార్చిన సంఘ‌ట‌న‌లో దారుణ‌మైన నిజాలు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డ‌వుతోంది. బాలుడి హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. తొంద‌ర‌గా డ‌బ్బు సంపాదించాల‌నే ఆలోచ‌న‌తో మంద సాగ‌ర్ అనే మెకానిక్ దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేయాల‌ని ప్ర‌ణాళిక ర‌చించాడు.

ఇంటి బ‌య‌ట ఆడుకుంటున్న బాలుడికి మాయ‌మాట‌లు చెప్పి బైక్‌పైన ఎక్కించుకొని వెళ్లాడు. స‌మీపంలోని నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లిన త‌ర్వాత బాలుడు త‌న‌ను గుర్తు ప‌డ‌తాడు కాబ‌ట్టి ఇంటికి వెళ్లిన త‌ర్వాత త‌న గురించి చెబుతాడ‌నే భ‌యంతో కిడ్నాప్ చేసిన గంట‌లొపే దీక్షిత్‌ను దార‌ణంగా హ‌త‌మార్చాడు. కిడ్నాప్ చేసింది, బాలుడిని హ‌త్య చేసింది శ‌నిగ‌రం గ్రామానికి చెందిన మంద సాగ‌ర్ అని పోలీసులు గుర్తించారు.

అత‌డితో పాటు మ‌రో ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. కిడ్నాప‌ర్ వాడిన టెక్నాల‌జీతోనే అత‌డిని ప‌ట్టుకున్న‌ట్లు చెప్పారు. ఈ సంఘ‌ట‌న‌పై మ‌రింత లోతైన విచార‌ణ జ‌రిపి నిందితుల‌కు వేగంగా క‌ఠిన శిక్ష ప‌డేలా చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. నిందితుల‌ను పూర్తిగా విచారిస్తే మ‌రిన్ని నిజాలు బ‌య‌ట‌కు రావ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు.

Related News