logo

  BREAKING NEWS

మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |  

తెలంగాణలో భారీగా పోలీసు ఉద్యోగాలు.. పోస్టుల వారిగా ఖాళీలు ఇవే!

తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో కొలువుల జాతర జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు, మండలాలు, కమిషనరేట్ల ఏర్పాటుతో పోలీసు శాఖలో ఖాళీల భర్తీ అనివార్యమైంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 20 వేల పోలీసు ఉద్యోగాల నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈమేరకు తాజాగా పోలీసు శాఖలో ఖాళీల వివరాలను తెలుపుతూ ఒక నివేదికను ప్రభుత్వానికి అందించారు అధికారులు. ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 425 ఎస్ఐ పోస్టుల భర్తీ చేయవలసి ఉందని అధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొన్నారు. అందులో సివిల్ ఎస్ఐ 368, ఏఆర్- 29, కమ్యూనికేషన్ విభాగంలో 18 పోస్టులు ఉన్నాయి.

వీటితో పాటుగా భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఈ మేరకు మొత్తం 19, 300 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయాలనీ అధికారులు పేర్కొన్నారు. అందులో సివిల్ 7764, ఎఆర్ 6683, టీఎస్ ఎస్ పీ-3874, కమ్యూనికేషన్స్ -256 ఉన్నాయి. వీటితో పాటుగా 15 వ బెటాలియన్ లో మరో 561 ఖాళీలు ఉన్నాయని పోలీసు శాఖ ప్రభుత్వానికి అందించిన నివేదికలో తెలిపింది.

Related News