logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరితే ప్రతి నెల రూ.10,000 పెన్షన్ పొందవచ్చు

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో ‘ప్రధాన మంత్రి వ్యయ వందన స్కీమ్’ కూడా ఒకటి. 2017లో ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. తాజాగా ఈ స్కీమ్ కాల వ్యవధిని 2021 మార్చి 31 వరకు పెంచుతున్నట్టుగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే కొత్తగా ఈ స్కీమ్ లో చేరాలనుకునే వారికి మార్చి 31 వరకు అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న వాటిలో అత్యధిక వడ్డీని అందించే స్కీమ్ ఇది. భారత ప్రభుత్వ రంగ ఇన్స్యూరెన్స్ సంస్థ అయిన ఎల్ఐసి ఈ పథకానికి సంబందించి వ్యవహారాలను చూస్తుంది. ఈ స్కీమ్ లో చేరిన వారు నెల నెలా రూ. 1000 నుంచి రూ. 10,000 వేల వరకు పెన్షన్ రూపంలో పొందవచ్చు. ఈ పాలసీ తీసుకోవడానికి ఆన్ లైన్ ద్వారా కానీ ఆఫ్ లైన్ ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకోసం ఆధార్ నంబర్ తప్పనిసరి. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు.

ఈ పాలసీ ద్వారా నెల నెలా రూ. 1000 రూపాయలు పొందాలనుకునే వారు డిపాజిట్ కింద రూ. 1,56,658 రూపాయలను చెల్లించాలి. నెల నెలా రూ. 10, 000 పొందాలనుకునేవారు రూ. 15,66,580 లను డిపాజిట్ చేయవలసి ఉంటుంది. పెట్టుబడిని బట్టి వడ్డీ రూపంలో ఈ పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్ లైఫ్ టైం 10 సంవత్సరాలు. పదేళ్లు గడిచిన తర్వాత పాలసీదారుడికి అతను డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.

పాలసీ తీసుకున్న మధ్యలో ఆ వ్యక్తి మరణిస్తే అతను డిపాజిట్ చేసిన మొత్తాన్ని అతని జీవిత భాగస్వామి, పిల్లలు, లేదా నామినీకి చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకున్న మూడేళ్ళ తర్వాత అవసరమైతే 75 శాతం వరకు రుణం కూడా తీసుకునే అవకాశం ఉంది. వడ్డీ కింద ఏడాదికి 10 శాతం చెల్లించవలసి ఉంటుంది. 10 ఏళ్ల గడువు ముగియక ముందే పాలసీని వెనక్కి తీసుకోవాలని భావిస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 98 శాతం మాత్రమే వెనక్కి ఇస్తారు.

Related News