logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

సైనికుల బలిదానాలు వృథా కావు.. చైనాకు ప్రధాని హెచ్చరిక!

భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన గాల్వాన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది భారత సైనికుల మృతి పట్ల భారతీయులంతా ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఒక్క తుపాకీ కూడా పేల్చకుండా మన భూభాగంలోకి చొరబడి మన జవాన్లను దొంగ దెబ్బ తీసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ అంశంపై ప్రధాని మోడీ ఇప్పటివరకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

చైనా వక్ర బుద్ధికి భారత్ ఎలాంటి సమాధానం చెప్పబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ లఢక్ ఘటనపై స్పందించారు. దేశంలో కొవిడ్ పరిస్థితులపై రోజు ప్రధాని మోదీ 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొందరు లెఫ్టినంట్ గవర్నర్లు కూడా పాల్గొన్నారు. సమావేశానికి ముందు ప్రధాని లఢక్ లో అమరులైన వీర జవాన్ల మరణానికి నివాళులు అర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై పలు కీలక వ్యాఖ్యలు చేసారు. జవాన్ల ప్రాణత్యాగాలు ఊరికే పోవని, ఈ అంశం పై అనుమానం వద్దని స్పష్టం చేసారు. ‘అమరులైన బలిదానాలు ఊరికే పోవు. ఈ అంశంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. భారత్ ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుంది. కానీ అవసరమైతే ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది’. అని మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు. అమర జవాన్లు పోరాడుతూ ప్రాణాలు వదిలి దేశం గర్వించేలా చేసారన్నారు. మోడీ వ్యాఖ్యలతో ఆయన చైనాకు పరోక్షంగా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది.

Related News