logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ప్రధాని మోదీ వేయించుకున్న వాక్సిన్ ఏదో తెలుసా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండో విడత వాక్సిన్ పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ వాక్సిన్ తీసుకున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ లోని ఎయిమ్స్ లో మొదటి విడత వాక్సిన్ డోసు తీసుకున్నటుగా ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా పై పోరాడుతున్న శాస్త్రవేత్తలు, వైద్యుల కృషి వెలకట్టలేనిదని ప్రధాని ప్రశంసించారు.

రెండో విడత వాక్సిన్ పంపిణీలో 45 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, 60 సంవత్సరాలు పైబడిన వారికి వాక్సిన్ ను అందజేస్తున్నారు. వీరంతా వాక్సిన్ వేయించుకోవాలని ప్రధాని కోరారు. ప్రజలంతా కలిసి కట్టుగా కరోనాను ఎదుర్కోవాలని మోదీ పిలుపునిచ్చారు. కాగా భారత్ లో కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రస్తుతం రెండు వాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి.

అందులో దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ ఒకటైతే, రెండోది సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్. మరి ప్రధాని ఈ రెండు వాక్సిన్లలో ఏది వేసుకున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాగా ప్రధాని పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ ను వేసుకున్నారు. మరి 28 రోజుల్లో రెండో డోసు వాక్సిన్ ను కూడా వేయించుకోనున్నట్టుగా ఎయిమ్స్ వెల్లడించింది. తొలి విడతలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే టీకా పంపిణీ జరిగేది కాగా ఇప్పుడు ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు.

Related News