సోమవారం రోజున రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించకుండా ఉండాల్సిందేనని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికే మార్గదర్శకమన్నారు.
దేశం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుంది. ప్రపంచమంతా భారత్ వైపే చూస్తుంది. కోవిడ్ సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. కనిపించని శత్రువుతో అలుపెరుగని పోరాటం చేసిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడనికి ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. యావత్ ప్రపంచం భారత్ కృషిని కొనియాడుతుందన్నారు. భారత్ మరింత బలపడటానికి కోవిడ్ సంక్షోభం ఉపయోగపడింది.
ఆత్మనిర్భర్ వైపు భారత్ అడుగులు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద వాక్సిన్ ప్రక్రియ భారత్ లోనే సాగుతుంది. వోకల్ ఫర్ లోకల్ మన మంత్రంగా మారిందన్నారు. ఈ సందర్భంగా మోదీ సర్జికల్ స్ట్రైక్స్ గురించి మరోసారి ప్రస్తావించారు. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా భారత దేశ సామర్థ్యం మరోసారి బయటపడిందన్నారు.