logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

ప్రధాని మోడీ కీలక నిర్ణయం.. చైనాకు మరో షాక్!

చైనా సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతున నేపథ్యంలో భారత్ ఆ దేశానికి చెందిన 59 యాప్ లపై నిషేధం విధించి షాకిచ్చింది. ఇప్పుడు ప్రధాని మోడీ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. భారత్ లో చైనా ట్విట్టర్ గా పేరున్న వీబో నుంచి కూడా వైదొలగాలని మోడీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. చైనా పర్యటనకు ముందు 2015 లో వీబోయాప్ లో మొదటిసారిగా అడుగుపెట్టారు మోడీ.

ఆ సమయంలో దీనికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. ఈ ఖాతాలో ప్రధాని, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కలిసి తీసుకున్న ఫోటోలు, చైనా పర్యటన విశేషాలను పొందుమరిచారు. వీబోలో ఇప్పటికే ప్రధానికి 2,44,000 ఫాలోవర్లు ఉన్నారు. ప్రతి ఏటా జూన్ 15వ తేదీన ప్రధాని జిన్ పింగ్ కు అయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేస్తారు. కానీ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది ఎలాంటి వెలువడలేదు.

అయితే ఇప్పటివరకు 115 పోస్టులు ఉండాల్సిన ఈ అకౌంట్ ఇప్పుడు ఖాళీగా కనపడుతుండటం గమనార్హం. దీంతో మోడీ వీబో నుండి వైదొలగనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వీబో యాప్ లో వీఐపీల అకౌంట్ ను తొలగించే ప్రక్రియ క్లిష్టంగా ఉంటుంది. ఇది కొంత సమయంతో కూడుకున్నది కావడం, పూర్తిగా అకౌంట్ నుంచి వైదొలగడానికి ఆ యాప్ నుంచి అనుమతులు లభించవలసి ఉన్న కారణంగా ప్రస్తుతానికి అందులో ఉన్న పోస్టులను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది అని సమాచారం.

Related News