logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ప్రధాని మాస్కు ధర అడిగిన పౌరుడికి పీఎంవో అధికారుల షాక్!

2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి పౌరుడికి ప్రభుత్వం, దాని సంస్థల వివరాలను తెలుసుకునే హక్కును రాజ్యాంగం కల్పించింది. అయితే హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఈ చట్టం ద్వారా ప్రధానికి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం ప్రధాన మంత్రి కార్యాలయానికి ఓ దరఖాస్తు చేసాడు.

నగరానికి చెందిన రాబిన్ అనే వ్యక్తి గతేడాది పీఎంవో కార్యాలయానికి చేసిన దరఖాస్తులో ప్రధాని మోదీ ఏ మాస్కు ధరిస్తున్నారు? దాని ధర ఎంత? ప్రధాని వాక్సిన్ వేసుకున్నారా? అనే విషయాలు తెలియజేయాలని కోరారు. కాగా దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించింది. ఆ దరఖాస్తుదారుడు అడిగిన మాస్కు ధర, వాక్సిన్ వివరాలన్నీ చాలా వ్యక్తిగతమైనవని పేర్కొంది.

వాటికి సంబందించిన వివరాలను బయటకు వెల్లడించలేమని పేర్కొంది. ఆర్టీఐ యాక్ట్ లోని సెక్షన్ 8(1) ప్రకారం ఆ వివరాలను వెల్లడించడం లేదని పేర్కొంది. అయితే ప్రధాని మాస్కులకు అయ్యే ఖర్చును మాత్రం ప్రభుత్వ భరించడం లేదని పీఎంవో కార్యాలయం స్పష్టం చేసింది.

Related News