logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం.. దేశ ప్రజలకు శుభవార్త ..!

జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. జూన్ 1వ తేదీ నుంచి దేశం ఆన్ లాక్ 2.0 లోకి అడుగు పెట్టనుందని అన్నారు. రానున్నది వర్షాకాలం కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ప్రధాని సూచించారు. దేశంలో సరైన సమయానికి లాక్ డౌన్ విధించి కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు. అదే విధంగా ప్రజలంతా లాక్ డౌన్ లో సహకరించారన్నారు. కోవిడ్ పై భారత్ అద్భుతంగా పోరాడుతుందన్నారు.

ఇకపై కూడా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కొనసాగించాలన్నారు. మాస్కు ధరించడమే 130 కోట్ల మంది భారతీయుల ముందున్న అత్యుత్తమ బాధ్యతగా పేర్కొన్నారు మాస్కు ధరించని కారణంగా ఓ దేశ ప్రధానికి రూ. 13 వేల జరిమానా విధించారని అన్నారు. కాబట్టి ఈ కార్యానికి ప్రధాని నుంచి గ్రామ సర్పంచ్ వరకు ఎవ్వరూ అతీతం కాదన్నారు.

కాగా లాక్ డౌన్ కారణంగా కోట్ల మంది భారతీయులను ఆకలి బాధల నుంచి రక్షించడానికి 1.75 లక్షలకోట్లతో గరీబ్ కళ్యాణ్ యోజనను రావేశపెట్టమన్నారు. కాగా రానున్నవి పండగ రోజులని ప్రధాని గుర్తు చేసారు. దసరా, దీపావళి ఇలా అనేక పండుగలు జరుపునే భారత్ లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇప్పుడు నవంబర్ నెల వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని శుభవార్త వినిపించారు.

ఈ నేపథ్యంలో ప్రజలకు మరో ఐదు నెలలు ఉచితంగా 5 కేజీల బియ్యం, కిలో పప్పు అందిస్తామని హామీ ఇచ్చారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు ఉచిత బియ్యం, పప్పు అందనున్నాయని చెప్పారు. దేశంలోని ప్రతీ రైతుకు, పన్ను చెల్లింపుదారునుకు పేదలందరి తరపున చేతులెత్తి నమస్కరిస్తున్నామని చెప్పారు.

Related News