logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

రైతుల ఖాతాలోకి రూ. 6000.. ఇంకా ఈ పథకంలో చేరని వారు ఇలా దరఖాస్తు చేస్కోండి!

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కూడా ఒకటి. ఈ పథకంలో చేరే రైతులకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా లభిస్తుంది. ఏడాదికి రూ. 6000 వేల చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బును రైతులకు నేరుగా అందజేస్తుంది. ఇప్పటివరకు ఈ పథకంలో చేరని రైతులు ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. లేకుంటే పంచాయతీ కార్యదర్శి, పట్వారీ, స్థానికంగా ఉండే ఈ సేవా కేంద్రాల నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పథకంలో చేరడం చాలా సులభం..
1. మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ కు వెళ్ళాలి.
2. అక్కడున్న ఫారం కార్నర్ కు వెళ్లి ‘కొత్త రైతు నమోదు’ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
3. ఆధార్ నంబర్ ఇచ్చి క్యాప్చ కోడ్ ను ఎంటర్ ఎంటర్ చేయాలి. ఇక్కడే మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
4. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పంటకు సంబందించిన సమాచారం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఒక వేళ మీరు ఇదివరకే ఈ పథకంలో చేరి ఉన్నా మీకు డబ్బులు రాకపోతే కూడా ఇదే వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. పోర్టల్ లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ పథకం ద్వారా రావలసిన డబ్బు ఎందుకు నిలిచిపోయిందో అక్కడ కారణం ఉంటుంది. వారు అడిగిన డాక్యుమెంట్లను ఇచ్చి ప్రక్రియను పూర్తి చేస్తే వెంటనే మీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు.

2019 లో ప్రారంభించిన ఈ పథకంలో కొన్ని లోపాలను సరిదిద్దింది కేంద్రం. అంటే గతంలో ఈ ప్రయోజనాలు పూర్వీకుల భూమిలో వాటాలు ఉన్నవారికి కూడా అందేవి. అయితే ఇప్పుడు కేవలం వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఇస్తున్నారు. ఈ పథకానికి అర్హులైన రైతులకు ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు మొదటి విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు రెండో విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు మూడో విడత నగదును అందిస్తారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే రైతులు తమ ప్లాట్ నంబరును కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఇవ్వాల్సి ఉంటుంది.

Related News