logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

పింక్ వాట్సాప్ అంట.. పొరపాటున ఈ లింక్ క్లిక్ చేసారా? వెంటనే ఇలా చేయండి

ఒక వైపు ఫేక్ లింక్స్, మరోవైపు ఫేక్ న్యూస్. ఏం చేసినా వాట్సాప్ యూజర్లకు ఈ బెడద తప్పడం లేదు. తాజాగా వాట్సాప్ యూజర్లకు మరో ముప్పు పొంచి ఉంది. ఇటీవల కొంత మంది వాట్సాప్ పింక్ అనే లింకును షేర్ చేస్తున్నారు. ఈ లింకును క్లిక్క్ చేస్తే వాట్సాప్ లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని చెప్తూ దీనిని వైరల్ చేస్తున్నారు. మీరు గనక ఈ లీక్ ను క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వచ్చు. మీ వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళవచ్చు. మొత్తంగా మీరు చిక్కుల్లో పడవచ్చంటూ సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ లింక్ కూడా అచ్చం వాట్సాప్ ను పోలి ఉంది. అయితే ఇది పింక్ కలర్ లో కనిపిస్తుంది. దీనికి ఆకర్షితులైన వారు ఈ లింకును క్లిక్ చేసి ముప్పును కొని తెచ్చుకుంటున్నారు. నిజానికి వాట్సాప్ లో ఎలాంటి కొత్త ఫీచర్లు లేవు. ఒక వేళ వచ్చినా వాటిని ప్లే స్టోర్ ద్వారా అప్ డేట్ చేసుకోవడం ఒక్కటే మార్గం. వాట్సాప్ తమ యూజర్లకు ఇలాంటి లింకులు పంపించదని గుర్తించాలి.

ఒక వేళ ఇప్పటికే ఎవరైనా ఈ లింకును క్లిక్ చేసి ఉంటె వెంటనే తమ ఫోన్ ను రీ సెట్ చేసుకోవాలని, మెయిల్‌ ఐడీ, బ్యాంకు ఖాతాలు, సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడంతో పాటుగా మీ సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక ముందు కూడా వాట్సాప్ యూజర్లు ఇలాంటి ఫేక్ లింక్స్ పై అవగాహన ఏర్పరుచుకోవాలి, ఆన్ లైన్ లో దొరికే సమాచారమంతా నిజమని నమ్మితే నష్టపోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Related News