logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

కరోనా లాక్ డౌన్ తో ఏర్పడిన నష్టాలను పూడ్చుకునేందుకు ఢిల్లీతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో వీటి ధరలు విపరీతంగా పెరగనున్నాయి. హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల్లో కూడా వరుసగా రెండో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం నాటి ధరలకు అదనంగా ఈరోజు దాదాపు 60 పైసల చొప్పున ధరలు పెంచుతున్నట్టుగా చమురు కంపెనీలు ప్రకటించాయి.

దీంతో  లీటర్ పెట్రోల్ ధర రూ.71.86 నుంచి రూ.72.46 అవ్వగా.. డీజిల్ ధర లీటర్ రూ.69.99 నుంచి.. ఈ రోజు రూ.70.59గా ఉంది.  అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ పెంచుతున్నట్టుగా కంపెనీలు పేర్కొన్నాయి. మరి గతంలో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదు కదా అంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ధరలపై సమీక్ష జరిపి అంతర్జాతీయ ముడి చమురు ధరలను ప్రతి నెలాఖరులోసవరించేది. కానీ ఈ విధానానికి ఇటీవల ఆయిల్ కంపెనీలు స్వస్తి పలికాయి. రోజువారీ సమీక్ష అనంతరం ధరలను నిర్ణయిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Related News