logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

క‌రోనాతో క‌లిసి జీవించ‌డం నేర్చుకోవాలి

క‌రోనాతో క‌లిసి జీవించ‌డం ప్ర‌జ‌లు నేర్చుకోవాల‌ని, క‌రోనా సోక‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను జీవితం భాగం చేసుకోవాల‌ని కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. దేశంలో క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేప‌థ్యంలో వైద్యారోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. మ‌రోవైపు దేశంలో క‌రోనా పాజిటీవ్ కేసులు వ‌రుస‌గా రెండో రోజు కూడా 3 వేలు దాటాయి. గ‌త 24 గంట‌ల్లో 3,390 న‌మోదు కావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 56,342కు చేరింది.

ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 1,886 మంది క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించ‌గా 37,916 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా, క‌రోనా నుంచి కోలుకుంటున్న బాధితుల‌ రిక‌వ‌రీ రేటు కూడా క్ర‌మంగా పెరుగుతోంది. ప్ర‌స్తుతం దేశంలో రిక‌వ‌రీ రేటు 29.26గా ఉంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 212 జిల్లాల్లో ఒక క‌రోనా పాజిటీవ్ కేసు కూడా న‌మోదు కాలేదు. ప్ర‌జ‌లు క‌రోనా వైర‌స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉంటూ, ఏమి చేయాలి, ఏమి చేయొద్దు అనే నియంత్ర‌ణ‌లో ఉంటే దేశంలో క‌రోనా కేసులు పీక్‌కు వెళ్ల‌వ‌ని ల‌వ్ అగ‌ర్వాల్ పేర్కొన్నారు.

Related News