logo

  BREAKING NEWS

క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |   క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |  

హ‌య‌త్‌న‌గ‌ర్ టీఆర్ఎస్‌ కార్పొరేట‌ర్‌ను గ‌ల్లా ప‌ట్టి కొట్టిన మ‌హిళ‌లు

వ‌ర్షాల కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల ఓపిన న‌శిస్తోంది. ప్ర‌జ‌ల ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకొని ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ నిల‌దీస్తున్నారు. తాజాగా ఎల్‌బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం హ‌యత్‌న‌గ‌ర్ కార్పొరేట‌ర్ సామ తిరుమ‌ల్ రెడ్డిపైన ప్ర‌జ‌లు దాడి చేశారు. తిరుమ‌ల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్‌.

భారీ వ‌ర్షాల కార‌ణంగా హ‌య‌త్‌న‌గ‌ర్ డివిజ‌న్‌లో ప‌రిధిలోని బంజారా కాల‌నీ, రంగ‌నాయ‌కుల గుట్ట ప్రాంతంలో ఇళ్లు నీట‌మునిగాయి. నీట మునిగిన ఇళ్ల‌ను ప‌రిశీలించేందుకు కార్పొరేట‌ర్ తిరుమ‌ల్ రెడ్డి అక్క‌డ‌కు వెళ్లారు. త‌మ ప్రాంతంలో నాలాలు కబ్జాకు గురికావ‌డం వ‌ల్లనే త‌మ ఇళ్లు నీట‌మునిగే ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నాలాలు కబ్జా అవుతున్నాయ‌ని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని కార్పొరేటర్‌ను నిల‌దీశారు. ఇంత‌లో ఓ మ‌హిళ కోపం క‌ట్ట‌లు తెంచుకొని కార్పొరేట‌ర్ సామ తిరుమ‌ల్ రెడ్డి గ‌ల్లా ప‌ట్టి లాగి దాడి చేసింది. ఆమె త‌ర్వాత పలువురు స్థానికులు కూడా కార్పొరేట‌ర్‌పై చేయి చేసుకున్నారు. అక్క‌డే ఉన్న మ‌రికొంద‌రు నాయ‌కులు క‌ల‌గ‌జేసుకొని స్థానికుల‌కు న‌చ్చ‌జెప్పి కార్పొరేట‌ర్‌ను ప‌క్క‌కు తీసుకెళ్లారు.

Related News