logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

పాయల్ రాజ్ పుత్ కు మెగా హీరో బంపర్ ఆఫర్..!

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ లో సంచలన ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించినా ఆమె గ్లామర్ కు యూత్ ఫిదా అయిపోయారు. ఆ సినిమా తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నిత్యం ఎదో ఒక ఫోటో షూట్ తో వార్తల్లో నిలుస్తుంది పాయల్. తాజాగా పాయల్ రాజ్ పుత్ కు బంపర్ ఆఫర్ తగిలిందని సమాచారం.

ఏకంగా మెగా హీరోతో నటించే అవకాశం చేజిక్కించుకుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు. గతంలో బన్నీ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఏ రేంజ్ హిట్లో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు దేవి శ్రీ ప్ర్రసాద్ సంగీతం అందిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

కాగా ఈ ఐటెం నంబర్ కోసం సుకుమార్ మొదట కియారా అద్వానీని అనుకున్నారట. ఆ తర్వాత బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతుల బన్నీతో స్టెప్పులేస్తోందని వార్తలొచ్చాయి. ఫైనల్ గా ఈ పాట కోసం పాయల్ రాజ్ పుత్ ను సెలక్ట్ చేసారని ప్రచారం జరుగుతుంది. ఈ పాటతో పాయల్ క్రేజ్ మరింత పెరిగిపోతుందని సంబరపడుతున్నారు ఆమె అభిమానులు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. మైత్రి మూవీ నిర్మాణ సంస్థలో ఈ సినిమా రూపుదిద్దికుంటుంది.

Related News