logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా

2019 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో జ‌న‌సేన ఓడిపోవ‌డం కంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓడిపోవ‌డం జ‌న‌సైనికుల‌ను ఎక్కువ‌గా బాధించింది. ఆ ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం, విశాఖ‌ప‌ట్నం జిల్లా గాజువాక నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసి రెండుచోట్ల ఓడిపోయారు. గెలుపు అవ‌కాశాల‌ను స‌రిగ్గా అంచ‌నా వేయ‌డంలో, గెలిచే అవ‌కాశం ఉన్న స్థానాన్ని గుర్తించ‌డంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఆయ‌న అసెంబ్లీలో అడుగుపెట్ట‌లేక‌పోయారు.

అయితే, 2024 మాత్రం ఆయ‌న క‌చ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని భావిస్తున్నారు. ఇందుకు గానూ ఇప్ప‌టి నుంచే ఆయ‌న పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంపిక చేసుకునే ప‌నిలో ప‌డ్డార‌ని తెలుస్తోంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు అవ‌కాశాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని ఒక నిర్ణ‌యానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపుగా వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

పాల‌కొల్లు మెగా కుటుంబం స్వంత నియోజ‌క‌వ‌ర్గం. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఇక్క‌డి నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. 2009లో చిరంజీవి, 2019లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒకేర‌క‌మైన త‌ప్పులు చేశారు. ఎన్నిక‌ల చివ‌రి నిమిషంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంపిక చేసుకొని పోటీ చేశారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు సంపాదించుకునేందుకు కావాల్సిన స‌మ‌యం వీరికి ద‌క్క‌లేదు. దీంతో ఇద్ద‌రూ ఒట‌మి పాలుకావాల్సి వ‌చ్చింది.

ఈసారి ఆ త‌ప్పు చేయ‌కుండా రెండేళ్ల ముందే పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. నిజానికి పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు కూడా ఆయ‌న‌కు అనుకూలంగా ఉంటాయి. ఇక్క‌డి ప్ర‌జ‌లు మెగా కుటుంబాన్ని ఓన్ చేసుకుంటారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ జ‌న‌సేన‌కు 32 వేల ఓట్లు వ‌చ్చాయి. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసేందుకు పాల‌కొల్లు స‌రైన నియోజ‌క‌వ‌ర్గ‌మ‌ని జ‌న‌సేన పార్టీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

రెండేళ్ల ముందే నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంపిక చేసుకొని ఇప్ప‌టి నుంచి అప్పుడ‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌చ్చితంగా గెలిచే అవ‌కాశం ఉంటుంది. ఆయ‌న‌ను గెలిపిస్తే త‌మ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటార‌నే ఒక న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతుంది. అంతేకాదు, గ‌త ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌వ‌ర్గాల నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేయ‌డం కూడా ఆయ‌న‌కు న‌ష్టం చేసింది.

గెలిస్తే ఏ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఉంచుకుంటారో, ఏ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేస్తారు అనే ప్ర‌శ్న‌లు రెండు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో వ‌చ్చాయి. ఎక్క‌డో ఒక చోట ప‌వ‌న్‌ గెలుస్తారులే అని రెండు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు భావించి స్థానిక ప‌రిస్థితుల ఆధారంగా వైసీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించారు. అందుకే, మ‌రోసారి ఈ త‌ప్పు చేయ‌కుండా ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఇక తాను అదే నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం అవుతాన‌ని న‌మ్మ‌కం కూడా ఆయ‌న ప్ర‌జ‌లకు క‌ల్పించాల‌ని అనుకుంటున్నారు. కాబ‌ట్టి, వ‌చ్చేసారి పాల‌కొల్లు నుంచి ప‌వ‌న్ పోటీ దాదాపుగా ఖాయ‌మే అని తెలుస్తోంది.

Related News