logo

  BREAKING NEWS

పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |  

ప‌క్కా స్కెచ్‌తోనే ప‌వ‌న్‌ ”వ‌కీల్ సాబ్” కామెంట్.. అస‌లు క‌థ ఇదీ..!

కొంత విరామం త‌ర్వాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ రాజ‌కీయంగా యాక్టీవ్ అయ్యారు. కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ తుఫాను బాధిత రైతుల‌ను ఆదుకోవాల‌ని అని డిమాండ్ చేస్తూ ధ‌ర్నా చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు, త‌న‌ను తాను వ‌కీల్ సాబ్‌గా పిలుచుకున్న తీరు ఇప్పుడు వార్త‌ల్లో ఉంది.

అయితే, ఇదంతా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్కా స్కెచ్ అనేది అర్థ‌మ‌వుతోంది. మ‌చిలీప‌ట్నంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ… ”మీ సీఎం సాబ్‌కు చెప్పండి ఈ వ‌కీల్ సాబ్ చెప్పాడ‌ని చెప్పండి..” అంటూ ప‌వ‌న్ కామెంట్ చేశారు. అంటే త‌న‌ను తాను వ‌కీల్ సాబ్ అని చెప్పుకున్నారు. వ‌కీల్ సాబ్ అనేది త్వ‌ర‌లో రిలీజ్ కాబోతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా టైటిల్‌.

వ‌కీల్ సాబ్ అని త‌న‌ను తాను పిలుచుకోవ‌డం ద్వారా సీరియ‌స్ పాలిటిక్స్‌లో కూడా సినిమా ప్ర‌మోష‌న్ చేసుకోవ‌చ్చ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిరూపించిన‌ట్ల‌య్యింది. వ‌కీల్ సాబ్ అని పిలుచుకోవ‌డం ద్వారా ఒక మంచి పంచ్ డైలాగ్ కొట్ట‌డంతో పాటు త‌న సినిమాకు కూడా మంచి ప్ర‌చారం ల‌భించింది. ఆయ‌న ఈ కామెంట్ చేసిన ద‌గ్గ‌ర నుంచి ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం వ‌వ‌న్‌ను వ‌కీల్ సాబ్ అని పిల‌వ‌డం ప్రారంభించింది.

మ‌రోవైపు తాను వ‌కీల్ సాబ్ ఎలా అవుతాడ‌ని ప్ర‌శ్న‌లు మొద‌లుపెట్టింది. దీంతో వ‌కీల్ సాబ్ టైటిల్ రెండు రోజులుగా వార్త‌ల్లో, సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాజ‌కీయాల సంగ‌తి ప‌క్క‌న పెడితే త‌న సినిమా టైటిల్ వ‌కీల్ సాబ్‌ను ప్ర‌మోట్ చేయ‌డంలో ప‌వ‌న్ స‌క్సెస్ అయ్యారు. అయితే, సినిమాను రాజ‌కీయాల్లోకి తీసుకురావడం నిర్మాత‌కు న‌ష్టం చేయ‌వ‌చ్చు.

ఎందుకంటే.. చాలా మంది సినిమాల‌ను, రాజ‌కీయాల‌ను వేరుగా చూస్తుంటారు. వైసీపీ శ్రేణులు కూడా రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా ఒక హీరోగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌ను సైతం చూస్తారు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా రాజ‌కీయాల‌తో త‌న సినిమాను లింక్ చేయ‌డంతో ఇప్పుడు సినిమాను, రాజ‌కీయాల‌ను వేరుగా చూడ‌టం క‌ష్టం. కాబ‌ట్టి, వ‌కీల్ సాబ్ సినిమాకు వైసీపీ శ్రేణులు దూరంగా ఉండే అవ‌కాశం ఉంది. ఈ విధంగా వ‌కీల్ సాబ్‌కు న‌ష్టం జ‌ర‌గొచ్చు.

Related News