logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎక్కువ‌గా క్రేజ్‌, ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న హీరోల్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందుంటారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా తీయ‌డం ప్ర‌తీ ద‌ర్శ‌కుడికి ఒక క‌ల లాంటిది. కానీ, కొంద‌రికి మాత్ర‌మే ప‌వ‌న్‌తో సినిమా తీసే అవ‌కాశం ల‌భిస్తుంది. ఇటువంటి అవ‌కాశం ఇప్పుడు అనూహ్యంగా ఒక యువ ద‌ర్శ‌కుడికి వ‌చ్చింద‌నే ప్ర‌చారం అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను, ఇటు సినీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుం తెలుగు రీమేక్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇది మ‌ల్టీస్టార‌ర్ సినిమా. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు మ‌రో హీరోగా ద‌గ్గుబాటి రానా న‌టించ‌డం కూడా దాదాపుగా ఖ‌రారైంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గ‌త ఏడాది ఈ సినిమా మ‌ల‌యాళంలో ఎటువంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై భారీ హిట్ అయ్యింది.

ఇద్ద‌రు అగ్ర‌స్థాయి హీరోలు క‌లిసి న‌టిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఈ సినిమాకు ఒక యువ ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడ‌నేదే ఇప్పుడు అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది. ఈ యువ ద‌ర్శ‌కుడి పేరు సాగ‌ర్ చంద్ర‌. నారా రోహిత్‌, శ్రీ విష్ణు హీరోలుగా అప్ప‌ట్లో ఒకడుండేవాడు అనే చిత్రానికి సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాకు మంచి పేరే వ‌చ్చినా, అంత‌గా హిట్ ఏమీ కాలేదు.

ఈ సినిమా త‌ర్వాత సాగ‌ర్ చంద్ర మ‌రే సినిమా కూడా చేయ‌లేదు. ఇలా త‌క్కువ అనుభ‌వం ఉన్న ఒక యువ ద‌ర్శకుడికి ఇంత పెద్ద సినిమా తీసే ఛాన్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర‌మే. ప‌వ‌న్ కళ్యాణ్ ఈ విషయంలో యంగ్ ట్యాలెంట్‌పై న‌మ్మ‌కంతో భారీ రిస్క్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ సినిమా క‌థ‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫిదా అయ్యార‌ని తెలుస్తోంది.

అందుకే ఈ సినిమాను వెంట‌నే ప‌ట్టాలెక్కించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌కీల్ సాబ్ చిత్రంలో ప‌వ‌న్ న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా మ‌రో మూడె సినిమాల‌కు ప‌వ‌న్ ఓకే చెప్పారు. కానీ, ఇప్పుడు వాటన్నింటి కంటే ముందే వ‌కీల్ సాబ్ పూర్తి కాగానే అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ రీమేక్‌ను ముందుగా టేక‌ప్ చేయాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ భావిస్తున్నార‌ట‌.

ఈ సినిమా క‌థ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఒక ఎస్సై, ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీస‌ర్ మ‌ధ్య చిన్నగా మొద‌లైన గొడ‌వ ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు, ప‌గ‌ల‌కు దారి తీస్తుంది. ఈ క్ర‌మంలో ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ఇద్ద‌రూ అనేక ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఇద్ద‌రు హీరోల మ‌ధ్య ఈ క‌థ కొత్త‌గా ఉంటుంది. అందుకే మ‌ల‌యాళంలో సినిమా గ్రాండ్ హిట్ అయ్యింది. తెలుగులోనూ హిట్ అవ్వ‌డం ఖాయ‌మే కావ‌చ్చు.

Related News