logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌

రాజ‌కీయాల్లో కొంత‌కాలం బిజీగా ఉన్న త‌ర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. వ‌రుస సినిమాల‌ను ఒప్పుకుంటూ వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు క‌నీసం ఐదు సినిమాల‌ను రిలీజ్ చేయాల‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌. వ‌రుస‌గా సినిమాల‌ను ఒప్పుకుంటుండ‌టం, ఆప్‌డేట్స్ ఇస్తుండ‌టంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌గా ఉన్నారు. ప్ర‌త్యేకించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి చేయ‌నున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీపైన ప‌వ‌న్ అభిమానుల‌కు చాలా ఆస‌క్తి ఉంది.

మ‌ళ‌యాళంలో వ‌చ్చిన అయ్య‌ప్ప‌నుం కోశియుమ్ అనే సూప‌ర్ హిట్ సినిమాకు ఇది రీమేక్ కావ‌డంతో తెలుగులో కూడా భారీ హిట్ కొడుతుంద‌ని ప‌వ‌న్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాకు సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌గా కీల‌క పాత్ర‌లో హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి న‌టిస్తోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో, రానా రిటైర్డ్ ఆర్మీ అధికారిగా క‌నిపించ‌నున్నారు.

అంతా బాగానే ఉంది, సినిమా సూప‌ర్ హిట్ ఖాయ‌మ‌నుకుంటున్న ప‌వ‌న్ అభిమానుల‌ను ఒక బ్యాడ్ సెంటిమెంట్ భ‌య‌పెడుతోంది. సాధార‌ణంగా హిట్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఏదైనా సినిమాలో ఉంటారంటే దానికి అద‌న‌పు బ‌లం ఉంటుంది. పైగా ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబోకు స‌క్సెస్ రేట్ ఎక్కువ‌. ఇప్పుడు అయ్య‌ప్ప‌నుం కోశియుమ్ రీమేక్‌లో కూడా త్రివిక్ర‌మ్ ప‌ని చేస్తున్నారు. అయితే, డైరెక్ట‌ర్‌గా కాకుండా మాట‌ల రచ‌యిత‌గా త్రివిక్ర‌మ్ ఈ సినిమాకు ప‌ని చేస్తారు.

ద‌ర్శ‌కుడిగా మారిన త‌ర్వాత బ‌య‌టి సినిమాల‌కు త్రివిక్ర‌మ్ ర‌చ‌యిత‌గా చేయ‌డం లేదు. డైరెక్ట‌ర్ అయిన త‌ర్వాత‌ కేవ‌లం రెండు బ‌య‌టి సినిమాల‌కు మాత్ర‌మే ఆయ‌న మాట‌లు రాశారు. 2011లో వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీన్మార్ సినిమాకు త్రివిక్ర‌మ్ మాట‌లు అందించారు. హిందీలో సూప‌ర్ హిట్ అయిన ల‌వ్ ఆజ్ క‌ల్ సినిమాకు ఇది రీమేక్‌. కానీ, ఎన్నో అంచ‌నాల‌తో వ‌చ్చిన తీన్మార్ తెలుగులో ఫెయిల్ అయ్యింది.

ఇప్పుడు అయ్య‌ప్ప‌నుం కోశియుమ్ కూడా రీమేక్ సినిమానే. త్రివిక్ర‌మ్ మాట‌లు రాస్తున్నారు. కాబ‌ట్టి, తీన్మార్ బ్యాడ్‌ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ? అనే భ‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల్లో ఉంది. తీన్మార్ మాత్ర‌మే కాదు డైరెక్ట‌ర్‌గా మారిన త‌ర్వాత జైచిరంజీవ సినిమాకు కూడా త్రివిక్ర‌మ్ మాట‌లు అందించ‌గా ఆ సినిమా కూడా ఫెయిల్ అయ్యింది. ఈ సారి అయ్య‌ప్ప‌నుం కోశియుమ్ సినిమాతో త్రివిక్ర‌మ్ ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తార‌ని ఆశిద్దాం.

Related News