logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

దీక్ష‌కు దిగిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక రోజు దీక్ష‌కు దిగారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌రుసగా హిందూ దేవాల‌యాల‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా ఆయ‌న హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో నిర‌స‌న దీక్ష చేస్తున్నారు. ఇటీవ‌ల అంత‌ర్వేదిలో శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ర‌థం అనుమానాస్ప‌ద‌రీతిలో ద‌గ్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన నిర‌స‌న‌ల‌కు నిలుపునిచ్చాయి.

గ‌త రెండు రోజులుగా రెండు పార్టీల శ్రేణులు అంత‌ర్వేదితో పాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. దేవ‌తామూర్తులు, ఉత్స‌వ ర‌థాల విధ్వంసంపై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రికి అవ‌ల్భిస్తోంద‌నే ఆరోప‌ణ‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ దీక్ష చేస్తున్నారు.

బీజేపీ నేత‌లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవ‌రి ఇళ్ల‌ల్లో వారు దీక్ష‌లు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు రాజ‌మండ్రిలోని త‌న నివాసంలో, బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు ఢిల్లీలో, మ‌రో నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గుంటూరులో ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ దీక్ష‌లు చేస్తున్నారు. హిందూ ఆల‌యాలు, ర‌థాల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్న వారిని గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వీరు డిమాండ్ చేస్తున్నారు.

Related News