logo

  BREAKING NEWS

ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |  

దేవుడు వ‌ర‌మిచ్చినా.. కాలం క‌రుణించేలా లేదు

సినీ నిర్మాత బండ్ల గ‌ణేష్ సంతోషంతో ఉబ్బిత‌బ్బిబ‌వుతున్నాడు. త‌న దేవుడు త‌న‌ను క‌రుణించి, వ‌ర‌మిచ్చాడని ఖుషీ అవుతున్నాడు. త‌న దృష్టిలో దేవుడు అంటే ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. వ‌రం అంటే ఆయ‌నతో సినిమా తీసే అవ‌కాశం. త‌న‌తో సినిమా తీసేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒప్పుకున్నార‌ని ఇన్‌డైరెక్ట్‌గా బండ్ల గ‌ణేష్ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించాడు. ప‌వ‌న్ ఓకే చెప్ప‌డంతో మ‌రోసారి త‌న క‌ల నిజం కాబోతోంద‌ని బండ్ల గ‌ణేష్ అన్నాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌న్నిహితుల్లో బండ్ల గ‌ణేష్ ఒక‌రు. నిజానికి ప‌వ‌న్‌ను ఆయ‌న దేవుడిలా ఆరాధిస్తాడు. ఇంత‌కుముందు తీన్‌మార్‌, గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలు ప‌వ‌న్‌తో నిర్మించాడు బండ్ల‌. తీన్‌మార్ సినిమా ఫ్లాప్ అయ్యింద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలిచి మ‌రీ బండ్ల గ‌ణేష్‌కు గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా తీసే ఛాన్స్ ఇచ్చారు. గ‌బ్బ‌ర్ సింగ్ సూప‌ర్ హిట్ కావ‌డంతో బండ్ల గ‌ణేష్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ లైఫ్ ఇచ్చిన‌ట్లు అయ్యింది.

ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌తో టెంప‌ర్ సినిమా తీసిన బండ్ల గ‌ణేష్ తర్వాత ఇండ‌స్ట్రీలో సైలెంట్ అయ్యాడు. ఇటీవ‌లే స‌రిలేరు నీకెవ్వ‌రి సినిమాను నిర్మించి రీఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌తీ డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా తీయాల‌నేది ఒక క‌ల‌గా ఉంటుంది. ఇక బండ్ల గ‌ణేష్ లాంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరాభిమానికి ఇది మ‌రింత పెద్ద కోరిక‌. చాలా రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఒక సినిమా కోసం ఒప్పించాల‌ని బండ్ల గ‌ణేష్ ట్రై చేస్తున్నాడు. ఇప్ప‌టికి ప‌వ‌న్ క‌ళ్యాణ్.. బండ్ల గ‌ణేష్‌కి ఓకే చెప్పారు.

ఓకే అయితే చెప్పారు కానీ బండ్ల గ‌ణేష్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఇప్ప‌ట్లో సాధ్యం అయ్యే ప‌ని కాదు. ఎందుకంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న మొద‌టి సినిమా వ‌కీల్ సాబ్‌. ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. క‌రోనా, లాక్‌డౌన్ వ‌ల్ల ఈ సినిమా ఆల‌స్యమైంది. వ‌కీల్ సాబ్ త‌ర్వాత క్రిష్ జాగర్ల‌మూడితో మ‌రో సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట‌ర్‌గా రామ్ తాళ్లూరి నిర్మాత‌గా తెర‌కెక్క‌నున్న మ‌రో సినిమాలోనూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌నున్నారు. ఈ సినిమా కూడా లైన్‌లో ఉంది. మైత్రీ మూవీస్ వారితోనూ ఒక సినిమా చేస్తాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాటిచ్చారు. ఇవే కాక ప‌వ‌న్ న‌టించ‌నున్నారు అంటూ మ‌రిన్ని సినిమాల ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. వాటి సంగ‌తి ప‌క్క‌న‌బెట్టినా బండ్ల గ‌ణేష్‌తో సినిమా కంటే ముందు మూడు నాలుగు సినిమాలు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయాల్సి ఉంది.

ప‌వ‌న్ ఇది వ‌ర‌కు లాగా షూటింగ్‌కి పూర్తి స్థాయిలో స‌మ‌యం ఇవ్వ‌లేక‌పోతున్నారు. మ‌ధ్య‌లో ఆయ‌న రాజ‌కీయాల‌తోనూ బిజీగా ఉంటున్నారు. దీంతో షూటింగ్‌లు ఆల‌స్యంగానే జ‌రుగుతున్నాయి. ఇటువంటి స‌మ‌యంలో నాలుగు సినిమాల షూటింగ్ అయిపోవ‌డానికి క‌నీసం రెండున్న‌ర‌, మూడేళ్లు ప‌డుతుంది. అంతలో ఎన్నిక‌లు వ‌స్తాయి. అప్పుడు క‌చ్చితంగా ప‌వ‌న్ ఒక ఏడాది గ్యాప్ తీసుకుంటారు. కాబ‌ట్టి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా తీయాల‌నే బండ్ల గ‌ణేష్ కోరిక నెర‌వేరాలంటే క‌నీసం ఐదేళ్లు ప‌ట్టే అవ‌కాశం ఉంది.

Related News