logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

40 రోజులు.. 30 కోట్లు.. 25 శాతం.. ఇదీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేంజ్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఎవ‌రికైనా మ‌తి పోతుంది. మ‌రి, అంత‌లా క్రేజ్ ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అంటే అది ఇండ‌స్ట్రీకి ఒక పండుగ వాతావ‌ర‌ణాన్ని తెస్తుంది. ప‌వ‌న్ కళ్యాణ్ సినిమాకు టాక్ ఎలా వ‌చ్చినా క‌లెక్ష‌న్లు మాత్రం భారీగా వ‌స్తాయి. అందుకే ప‌వ‌న్‌తో సినిమా తీయాల‌ని ప్రొడ్యూస‌ర్లు లైన్ క‌డ‌తారు.

రాజ‌కీయాల నుంచి కొంత విరామం తీసుకొని మ‌ళ్లీ సినిమాల్లో న‌టించాల‌ని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. వ‌కీల్ సాబ్‌తో మొద‌లు పెడితే లైన్‌గా ఆరు సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇంకా కొంద‌రు డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమాకు ఒప్పించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు లిస్టులో ఉన్న సినిమాలు అయిపోవాలంటేనే మ‌రో మూడు, నాలుగేళ్లు క‌చ్చితంగా ప‌డుతోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా మ‌లయాళీ హిట్ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు యువ హీరో ద‌గ్గుబాటి రానా కూడా కీరోల్‌లో న‌టించ‌నున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిటైర్డ్ ఆర్మీ అధికారి పాత్ర‌లో, ద‌గ్గుబాటి రానా స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. చిన్న విష‌య‌మై ఈ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది.

ఆ గొడ‌వ ఎన్ని మ‌లుపులు తిరుగుతుంది, ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు ప‌గ తీర్చుకునేందుకు ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేశారు, చివ‌ర‌కు ఇద్ద‌రు క‌లుస్తారా ? వ‌ంటి అంశాల‌పై ఈ చిత్రం క‌థ ఉంటుంది. నిజానికి క్యూ ప్ర‌కారం చూస్తే వ‌కీల్ సాబ్‌తో పాటు మ‌రో మూడు సినిమాలు చేసిన త‌ర్వాత ఈ రీమేక్ సినిమాలో ప‌వ‌న్ చేయాలి. అంటే కనీసం మ‌రో రెండేళ్లు ప‌డుతుంది. కానీ, అనూహ్యంగా ప‌వ‌న్ ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చారు.

వ‌కీల్ సాబ్ త‌ర్వాత ఈ సినిమాలో న‌టించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. సాగ‌ర్ చంద్ర అనే యువ ద‌ర్శ‌కుడు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లైన్‌లో ఉన్న సినిమాల‌ను కాద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమాకు ముందుకు తీసుకురావ‌డానికి ఈ సినిమా క‌థ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బాగా న‌చ్చిండ‌మే కార‌ణ‌మ‌ట‌. అందుకే వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాను పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. పైగా షూటింగ్ కూడా వేగంగా జ‌రిపేందుకు ఈ సినిమాకు ఛాన్స్ ఉంది.

ఈ సినిమా కోసం కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్ 40 రోజుల కాల్‌షీట్స్ ఇస్తే స‌రిపోతుంద‌ట‌. కేవ‌లం 40 రోజుల కాల్‌షీట్స్‌కే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశార‌ట‌. రూ.30 కోట్ల రెమ్యున‌రేష‌న్‌తో పాటు లాభాల్లో 25 శాతం వాటా కూడా ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఆఫ‌ర్ చూస్తేనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేంజ్ ఏంటో తెలిసిపోతుంది.

Related News