logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

వకీల్ సాబ్ సెన్సార్ టాక్: పవన్ కెరీర్ లోనే ఇలా మొదటిసారి..!

పవన్ కళ్యాణ్ మూడేళ్ళ విరామం తర్వాత వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేతా థామస్ లతో పాటుగా శృతి హాసన్ కీలక పాత్రలోనటిస్తుంది. హిందీలో అమితాబ్ నటించిన ‘పింక్’ సినిమా కథను ఏమాత్రం చెడగొట్టకుండా పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాను మలిచాడు. విడుదలకు నాలుగు రోజుల ముందుగానే సెన్సార్ ను పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ కు U /A సెర్టిఫికెట్ లభించింది.

ఇదిలా ఉంటె వకీల్ సాబ్ సినిమాపై సెన్సార్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు భారీగానే ఉండనున్నాయని తెలుస్తుంది. అందుకే U /A సెర్టిఫికెట్ లభించింది. ఇక రెండున్నర గంటల నిడివి గల ఈ సినిమాలో పవన్ కనిపించే స్క్రీన్ టైం చాలా తక్కువని తెలుస్తుంది. కానీ పవన్ కనిపించే సీన్లకు స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయంగా తెలుస్తుంది. ఈ సినిమాపై సెన్సార్ సభ్యులు ప్రసంశలు కురుప్పిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే వకీల్ సాబ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు.

ఎమోషనల్ సన్నివేశాలు, పవన్ పవర్ ఫుల్ నటన, మరో లాయర్ పాత్రలో ప్రకాష్ రాజ్ డైలాగులు ఇలా ప్రతీది సినిమాలో హైలెట్ గా నిలుస్తుందట. ఫస్ట్ హాఫ్ మొత్తంలో నివేతా, అంజలి, అనన్యలు కనిపిస్తారని తెలుస్తుంది. సినిమాలో శృతి హాసన్ తో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మరో హైలెట్ గా చెప్తున్నారు. కోర్టులో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోయాయని టాక్. ఇక పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ లోనే ఒక యాక్షన్ సీన్ ఉంటుందట.

విలన్లు గోడపై ఉన్న వివేకానందుడి ఫోటోను నేలపైకి విసిరే సమయంలో ఓ చేయి గాల్లోనే ఆ ఫోటోను పట్టుకుంటుందని ఈ విధంగా పవన్ ఎంట్రీ ఉంటుందట. ఈ సీన్లకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమని అంటున్నారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కు కూడా మంచి టాక్ వస్తుంది. మొత్తానికి వకీల్ సాబ్ కు సెన్సార్ ఇచ్చిన రివ్యూతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసాయి. ఇక ఏప్రిల్ 9న ప్రేక్షకుల తీర్పు ఒక్కటే మిగిలి ఉంది.

Related News