logo

ఆ రెబెల్ ఎమ్మెల్యేకు ఊహించని షాక్ ఇవ్వనున్న పవన్..

జనసేన పార్టీ ఏకైక స్థానంలో గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. కానీ ఆ తర్వాత అధికార పార్టీని పొగుడుతూ సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అమరావతి ఉద్యమానికి పవన్ మాద్దతు ప్రకటిస్తే రాపాక మాత్రం సీఎం జగన్ మూడు రాజధానులు జై కొట్టారు. ఇలా పలు సందర్భాల్లో అధికార పార్టీపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రాపాకపై అధికారికంగా స్పందించలేదు.

రాపాక తీరు జనసైనికుల్లో ఆగ్రహం తెప్పించినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు పవన్. పార్టీ పేరుతో గెలిచి తన విజయంగా చెప్పుకుంటున్న రాపాకకు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ షాక్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇటీవల కోస్తా ప్రాంతంలోని పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అందులో భాగంగా రాజోలు పరిస్థితులపై ప్రత్యేక చర్చలు జరిపారట.

జనసైనికులు ఎవ్వరూ రాపాక వద్దకు వెళ్లోద్దని సూచించారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో సైతం రాపాకకు టికెట్ ఇవ్వబోమని కొత్త అభ్యర్థికి సైనికులంతా మద్దతివ్వాలని తెలిపారు. అలాగే స్థానిక ఎన్నికల్లో సైతం రాపాక అనుచరులకు టికెట్లు ఇవ్వకూడదని పవన్ నిర్ణయించుకున్నారని.. నిజమైన జనసైనికులకే ఈ సారి అవకాశం కల్పించాలని నిర్ణయించారట.

Related News