logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

నిహారిక ఎంగేజ్మెంట్ లో కనిపించని బాబాయి.. కారణం అదేనా?

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లి పీటలేక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరుకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు నిహారికల నిశితార్థం ఆగస్టు 13 రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ ఇందుకు వేదికైంది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటుగా ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వారందరు హాజరయ్యారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా నిహారిక నిశ్చితార్థం లో సొంత బాబాయి అయిన పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ విషయంపై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
కాగా పవన్ కళ్యాణ్ ఇపుడు దీక్షలో ఉన్నాడు. స్వామీజీలు, పీఠాధిపతులు ఆచరించే చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తున్నారు. ఈ దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల వరకు కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. దీక్ష ముగిసే వరకు పొలిమేరలు కూడా దాటరు.

అందువల్లే పవన్ ఈ కార్యక్రమానికి రాలేదని అంటున్నారు. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ తన అభిమాని అయిన నితిన్ వివాహ వేడుకకు హాజరై ఆశీర్వాదాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ సొంత ఇంటి శుభకార్యానికి రాకపోవడానికి కారణం ఏమయ్యుంటుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Related News