logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

‘హిమజ గారికి.. ‘అంటూ పవన్ లేఖ.. పట్టరాని సంతోషంలో బిగ్ బాస్ కంటెస్టెంట్!

తెలుగు టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన నటి హిమజ. ఆ తర్వాత కొన్ని సినిమాలలో కూడా మంచి పాత్రల్లో మెరిసింది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అవకాశం రావడంతో ఈ షో ద్వారా హిమజకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. బిగ్ బాస్ తర్వాత వరుస అవకాశాలను చేజిక్కించుకుంటుంది హిమజ. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. పవన్ కళ్యాణ్- క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హిమజ నటిస్తుంది.

కాగా ఆమెకు పవన్ కళ్యాణ్ నుంచి అందిన ఓ లేఖని సోషల్ మీడియాలో షేర్ చేసింది హిమజ. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వివరించడానికి మాటలు చాలడం లేదని ఎమోజిలని పోస్ట్ చేసింది. పవన్ తాను పంపిన లేఖలో ”నటి హిమజ గారికి.. మీకు అన్నీ శుభాలే కలగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నత స్థానాలను చేరుకోవాలని కోరుకుంటున్నా”నంటూ పవన్ పేర్కొన్నారు. దీంతో హిమజ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గతంలోనూ తన సినిమాల్లో పనిచేసిన పలువురు నటులకు పవన్ కళ్యాణ్ లేఖ ద్వారా బెస్ట్ విషెస్ ను అందించిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో నటించిన మల్ల యుద్ధ వీరులను పవన్ కళ్యాణ్ సత్కరించారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ పాత్రను విభిన్నంగా తీర్చిదిద్దుతున్నారు డైరెక్టర్ క్రిష్. ఈ సినిమాలో వజ్రాల దొంగగా పవన్ కనిపించబోతున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది.

Related News