logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

‘వకీల్ సాబ్’ లో ఆ ఎపిసోడ్ తీసేయాలట.. దిల్ రాజుకు పవన్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ మేనియానే కనపడుతుంది. అయితే సినిమా విజయంతో ఆనందంలో తడిసి ముద్దవుతున్న అభిమానులకు సినిమాపై ఒకే ఒక్క అసంతృప్తి మిగిలిపోయిందట. అదే వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఒరిజినల్ కథకు ఏమాత్రం సంబంధం లేని శృతి హాసన్ ఎపిసోడ్ ను జోడించి ఆ ఎపిసోడ్ ను మెయిన్ కథతో లింక్ చేసాడు దర్శకుడు.

అయితే ఈ సన్నివేశాలపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. సినిమా మొత్తంలో ఈ ఒక్క ఎపిసోడ్ పంటి కింద రాయిలా వుందటూ కామెంట్లు పెడుతున్నారు. ఫ్లాష్ బ్యాక్ ను సరిగ్గా డీల్ చేయలేకపోవడంతో అసలు ఈ ఎపిసోడ్ లేకపోయినా సినిమాకు నష్టమేమీ లేదంటున్నారు. శృతి హాసన్ కు పవన్ కు మధ్య న వచ్చే సన్నివేశాలు ఏమాత్రం పండకపోగా శృతి డ్రెసింగ్, మేకప్ అస్సలు బాగాలేదని అంటున్నారు. అలాగే ఈ ఎపిసోడ్ లో పవన్ లుక్ పై కూడా ఫాన్స్ నిరాశతో ఉన్నారట. ఈ

ఎపిసోడ్ మొత్తంలో చెప్పుకోదగ్గది ఏదైనా ఉందంటే అది సూపర్ హిట్ అయిన కంటిపాప సాంగ్ మాత్రమే. ఆ పాటను ఎలాగో యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు కాబట్టి కొంచెం కత్తెరకు పని చెప్పి ఈ ఎపిసోడ్ ను సినిమా నుంచి తొలగించాలంటూ నిర్మాత దిల్ రాజును ఫాన్స్ వేడుకుంటున్నారు. ఈ సీన్లు సినిమాపై ఉన్న ఇంప్రెషన్ ను తగ్గించేలా ఉన్నాయని అంటున్నారు. కానీ కథకు చాలా ముఖ్యమైన లింక్ ఇక్కడే ఉండటం వల్ల అది సాధ్యం అయ్యే పని కాదని తెలుస్తుంది.

అయినా ఫాన్స్ మాత్రం ఈ డిమాండ్లను దిల్ రాజు ముందుంచుతున్నారు. అయితే ఇలా విడుదలైన సినిమాలలో సీన్లను తొలగించడం ఇది కొత్తేమీ కాదు. గతంలో బడా హీరోల సినిమాలకు కూడా ఇదే జరిగింది. మరి వకీల్ సాబ్ విషయంలో దర్శక నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Related News