logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బ్రేకింగ్: రాంగోపాల్ వర్మ కార్యాలయంపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాడి..

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ‘పవర్ స్టార్- ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఏ వ్యక్తికి సంబంధం లేదని తాను కేవలం కల్పిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నానని వర్మ చెప్తున్నా.. ఆ సినిమా పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా తెరకెక్కిస్తున్నాడని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా పవర్ స్టార్ ట్రైలర్ తన కార్యాలయ సిబ్బంది కారణంగానే లీక్ అయినట్టుగా వర్మ ప్రకటించాడు. ఏ సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్స్, ఒక పాత, ట్రైలర్ విడుదల కాగా అవన్నీ వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వర్మ తాను ఎవ్వరి బెదిరింపులకు భయపడనని, తానేమీ గాజులు తొడుక్కుని కూర్చోలేదని తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. తన కార్యాలయం అడ్రెస్ చెప్పి మరీ దమ్ముంటే రావాలని సవాల్ విసిరాడు.

తాజాగా ఈరోజు కొందరు వ్యక్తులు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న వర్మ కార్యాలయం ఆర్జీవీ కంపెనీపై దాడికి పాల్పడ్డారు. రాళ్లతో దాడి చేసి కార్యాలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేసారు. కార్యాలయంలోకి వెళ్లి అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తన సినిమా పవర్ స్టార్ ట్రైలర్ రిలీజ్ చేసిన కారణంగానే తనపై జన సేన సైనికులు దాడి చేసే యత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా వర్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Related News