logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ‌బుల్ యాక్ష‌న్‌

ప‌వ‌న్ కళ్యాణ్ కెరీర్‌లో మంచి హిట్ సినిమా గ‌బ్బ‌ర్ సింగ్‌. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌లో ఇర‌గ‌దీశారు. పోలీస్ పాత్ర‌, హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాగా క‌లిసి వ‌చ్చాయి. ఇప్పుడు మ‌ళ్లీ ఈ రెండు పాజిటీవ్ వైబ్స్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా రానుంది. అంతేకాదు, ఈ సినిమాలో ఇంకా ప‌వ‌న్ కళ్యాణ్ అభిమానుల‌ను ఖుషీ చేసే చాలా అంశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ 29వ సినిమా హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో రానుంది. వ‌కీల్ సాబ్ ప‌వ‌న్ 26వ సినిమా. ఈ సినిమా త‌ర్వాత అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ రీమేక్‌లో ప‌వ‌న్ న‌టిస్తున్నాడు. ఆ త‌ర్వాత క్రిష్ డైరెక్ష‌న్‌లో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమా సెట్స్ మీద ఉంది. ఈ రెండు సినిమాల త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ప‌వ‌న్ 29వ సినిమా ఉండ‌నుంది.

టాలీవుడ్‌లో టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ల‌లో ఒక‌టిగా ఉన్న మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించ‌నున్నార‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కెరీర్‌లోనే మొద‌టిసారిగా ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించ‌నున్నార‌ట‌. తండ్రి కొడుకుల పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌నున్నారు. డ్యూయ‌ల్ రోల్‌లో ప‌వ‌న్ క‌నిపించ‌డం ఆయ‌న అభిమానుల‌కు క‌నువిందు లాంటిది.

ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ప‌వ‌న్‌ను పోలీస్ అధికారిగా హ‌రీష్ శంక‌ర్ బాగా చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలోనూ ప‌వ‌న్‌ను మ‌రోసారి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చూపించేందుకు హ‌రీష్ శంక‌ర్ సిద్ధ‌మ‌వుతున్నాడు. ప‌వ‌న్‌కు ఈ పాత్ర క‌లిసిరావ‌డంతో ఈసారి కూడా ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉండే అవ‌కాశం ఉంది.

Related News