logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త..!

ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త వినిపించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ చేపడుతున్న ఇళ్ల స్థలాల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించనున్నారు. డిసెంబర్ 25 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా కోర్టు స్టే విధించిన ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఇళ్ల పంపిణీకి రంగం సిద్దమవుతుంది.

లబ్ధిదారులకు ఢీ-ఫామ్ ఇచ్చి ఇంటి స్థలాన్ని కేటాయిస్తారు. అదే రోజు ఇంటి నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తారు. తొలి విడతలో దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణం జరపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30,68,281మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు. కాగా ఈ ఏడాది జులై 8న జరగవలసిన ఈ కార్యక్రమం కోర్టు తీర్పుతో వాయిదా పడిన విషయం తెలిసిందే.

Related News