logo

పతంజలి వివాదం: దగ్గు మందును కరోనాకు ఔషధంగా..

కరోనాకు మందు కనుగొన్నామని పతంజలి వ్యవస్థాపకుడు, యోగ గురువు రామ్ దేవ్ బాబా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మందును వంద మందికి పైగా కరోనా బాధితులపై పరీక్షించగా వారందరూ తిరిగి కోలుకున్నారని తెలిపారు. కాగా ‘కొరొనిల్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ మందుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. కేంద్ర ఆయుష్ శాఖ ఈ అంశంపై ప్రకటన చేస్తూ.. తాము చెప్పే వరకు ఈ మందును విడుదల చేయవద్దని కరోనాకు ముందుగా ప్రకటనలు చేయవద్దని తెలిపింది.

ఈ మందు శాస్త్రేయతపై మరింత పరీక్షించాల్సిన వసరం ఉందని వారు వెల్లడించారు. తాజాగా దీనికి సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కొరొనిల్ డ్రగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన సమయంలో ఇది కరోనాకు మెడిసిన్ గా పతంజలి ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంపొందించి, దగ్గు జ్వరం నివారించే ఔషధంగా కొరొనిల్ కు లైసెన్స్ కోరినట్టుగా లైసెన్సింగ్ అధికారి పేర్కొన్నారు.

దీనిపై పతంజలి సంస్థను తాము వివరణ కోరతామని అన్నారు. దీనిపై పతంజలి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య బాలకృష్ణ స్పందించారు. తాము ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన అన్ని నిబంధనలను వంద శాతం పాటించామని తెలిపారు.

Related News