logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బ్రిటన్ లో కొత్త కరోనా: యూకే నుంచి వచ్చిన ఐదుగురికి పాజిటివ్!

బ్రిటన్ ను వణికిస్తున్న కొత్త రకం కరోనాతో పొరుగుదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇటు భారత ప్రభుత్వం బ్రిటన్ నుంచి వచ్చే విమాన రాకపోకలపై నెల 31 వరకు నిషేధం విధించింది. ఇటీవల యూకే నుంచి వచ్చిన ప్రయాణికులందరికి ముంబై విమానాశ్రయంలో కరోనా పరీక్షలు నిర్వహస్తున్నారు. లక్షణాలు లేకున్నా వారందరినీ భారత ప్రభుత్వం క్వారెంటైన్ కు తరలిస్తున్నారు.

లక్షణాలు ఉన్నవారిని జీటీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇటీవల యూకే నుంచి ఢిల్లీ చేరుకున్న వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరిలో బ్రిటన్ నుంచి బెంగుళూరు, ముంబై వచ్చిన ఇద్దరు వ్యక్తులకు, కోల్‌కతా లో ఇద్దరికి, చెన్నైలో ఒకరికి కరోనా నిర్దారణ అయినట్టుగా అధికారులు గుర్తించారు.

అయితే వీరికి సోకింది కొత్త రకం కరోనానా కాదా అనే విషయాన్ని కనుగొనేందుకు నమూనాలకు సేకరించి పరీక్షల నిమిత్తం పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. వాటి ఫలితాల ఆధారంగా ఈ కొత్త కేసులపై ప్రకటన చేయనున్నారు. రెండు వారాల నుంచి యూకే నుంచి భారత్ కు వచ్చిన వారంతా పరీక్షలు జరిపించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కరోనా కొత్త స్ట్రెయిన్ బ్రిటన్ ను చిగురుటాకులా వణికిస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో ఈ కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ఉంటె మన దేశంలో కూడా మరోసారి కరోనా విజృంభణ తప్పదు. గతంలో మర్కట్ నుంచి వచ్చిన వారిని సరైన సమయంలో గుర్తించకపోవడంతో భారత్ లో కరోనా విజృంభించింది. ఇప్పుడు మరోసారి అదే పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటోంది.

లండన్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడికి కూడా కరోనా పాజిటివ్ గా గుర్తించారు. మంగళవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులందరినీ క్వారెంటైన్ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి ఫలితాలు రావలసి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులకు ఆర్టీపిసిఆర్ పరీక్షలు నిర్వహిస్తుంది.

Related News