logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

యాంకర్ ప్రదీప్ నన్ను రేప్ చేయలేదు.. మాట మార్చిన అత్యాచార బాధితురాలు

రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన పంజాగుట్ట అత్యాచార బాధితురాలి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వారం రోజుల కిందట 139 మంది నాపై 5 వేల సార్లు అత్యాచారం చేసారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు సహా ఎంతో మంది పేర్లు వెల్లడించింది. అయితే టీవీ యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు తమపై వస్తున్న అత్యచార ఆరోపణలను ఖండించారు. బాధితురాలు ఎవరో తమకు తెలియదని మీడియా ముందు వాపోయారు.

ఈ కేసులో తాజాగా బాధితురాలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. యాంకర్ ప్రదీప్ తనపై అత్యాచారం చేయలేదని, అలాగే కృష్ణుడికి కూడా ఈ కేసుతో సంబంధం లేదని వెల్లడించింది. రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ తనతో ఈ తప్పుడు ఫిర్యాదు చేయించారని ప్రదీప్ ను నిందితులుగా లిస్టులో పేర్కొనాలని తనపై ఒత్తిడి చేసాడని తెలిపింది.

లేదంటే తన కుటుంబాన్ని చెంపేస్తామని బెదిరించాడని పేర్కొంది. వాళ్లకు సంబంధం లేదని చెప్తున్నా వినకుండా తనతో కొందరి వ్యక్తుల పేర్లు ఫిర్యాదులో ఇప్పించారని తెలిపింది. సెలబ్రిటీల నుంచి డబ్బులు గుంజడానికే ప్రదీప్, కృష్ణుడి పేర్లు తనతో చెప్పించారని ఇంకా ఇద్దరు అమ్మాయిలను కూడా ఇలాగే ట్రాప్ చేసాడని తనను కొట్టి సెలబ్రిటీలతో ఫోన్లో మాట్లాడించాడని తెలిపింది.

అయితే తాను మొదటి నుంచి చెప్తున్న విధంగా తనపై 9 ఏళ్లుగా అత్యాచారం జరిగింది, కొందరు వ్యక్తులు తనను చిత్రహింసలకు గురి చేసింది నిజమేనని వెల్లడించింది. ఈ కేసులో మాజీ ఎంపీ కవిత ఫై కూడా తనను హిమిసించాడని పేర్కొంది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టిస్తున్న ఈ కేసులో బాధితురాలు ఈ విధంగా మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది.

Related News